కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కలవనున్నారు.
హైదరాబాద్: కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కలవనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులతో కలిసి బాబు వద్ద తన డిమాండ్లను ఉంచనున్నారు.
కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ పోటీ చేయనుంది. ఈ స్థానంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దింపుతోంది టీడీపీ. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలు, స్థానిక కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావును చంద్రబాబునాయుడు గురువారం నాడు అమరావతికి పిలిపించారు.
అమరావతిలో కూకట్‌పల్లి నియోజకవర్గ నేతల సమావేశంలో సుహాసిని పేరును చంద్రబాబునాయుడు ప్రకటించారు.కూకట్‌పల్లి కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావుకు పార్టీ పరంగా మంచి పదవి ఇస్తానని బాబు హమీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే కూకట్‌పల్లి స్థానం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కలవనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులతో కలిసి పెద్దిరెడ్డి చంద్రబాబునాయుడును కలవనున్నారు.
కూకట్‌పల్లి నుండి తాను ఎందుకు పోటీ చేయాలనుకొంటున్నారో బాబుకు పెద్ది రెడ్డి వివరించనున్నారు. తనకు ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని పెద్దిరెడ్డి కోరనున్నారు. అయితే ఇప్పటికే సుహాసిని పేరును చంద్రబాబునాయుడు పేరును ప్రకటించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కూకట్‌పల్లి విషయంలో బాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే అవకాశం ఉండదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కానీ, చివరి ప్రయత్నంగా చంద్రబాబు వద్దకు ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులతో పెద్దిరెడ్డి చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లనున్నారు. అయితే పెద్దిరెడ్డికి బాబు ఏ రకమైన హామీ ఇస్తారోననే విషయమై ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పెద్దిరెడ్డికి అవకాశం దక్కకపోవచ్చని భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
మీడియా ముందుకు నందమూరి సుహాసిని
33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని
‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?