ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్ ఓట్లడుగుతున్నారు: మల్లు

By narsimha lodeFirst Published Nov 19, 2018, 6:20 PM IST
Highlights

 నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హమీలను టీఆర్ఎస్ అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించా

మధిర: నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హమీలను టీఆర్ఎస్ అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దోపీడీ చేసిన డబ్బుతో  ఓట్లను కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. మధిర పౌరుషం ఏమిటో చూపిస్తామని భట్టి టీఆర్ఎస్‌కు సవాల్ చేశారు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలో సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో  కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

ఎన్నికల సమయంలో  ఇచ్చిన హమీలను  కేసీఆర్ అమలు చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు, దళితులకు మూడెకరాలు భూమిని ఇస్తామని  హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎందుకు  అమలు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ హామీలను  అమలు చేయనందుకు గాను ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ నేతలను  నిలదీయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయని కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు ఓట్లు అడిగే  హక్కు లేదన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలన్నారు.

ఈ ఎన్నికలు ప్రజలకు మధ్య దొరలకు మధ్య పోరాటంగా ఆయన  అభివర్ణించారు.ప్రజా కూటమి అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

అంతేకాదు కూలీ బందు పథకాన్ని కూడ ప్రవేశపెడతామన్నారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు కూడ వర్తింపజేస్తామని భట్టి హమీ ఇచ్చారు.మధిర పౌరుషాన్ని చూపిస్తామన్నారు.ప్రజలను మోసం చేసేవారికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన  చెప్పారు.

సంబంధిత వార్తలు

జనగామ నుండి నామినేషన్: కన్నీళ్లు పెట్టుకొన్న పొన్నాల

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

click me!