రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

By narsimha lodeFirst Published Nov 15, 2018, 3:19 PM IST
Highlights

కాంగ్రెస్  పార్టీ  టికెట్టు కోసం  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్  భక్త చరణ్ దాస్  రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్టు  సంచలన ఆరోపణలు చేశారు.


హైదరాబాద్:  కాంగ్రెస్  పార్టీ  టికెట్టు కోసం  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్  భక్త చరణ్ దాస్  రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్టు  సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి  సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మె్న్ డబ్బులు డిమాండ్ చేశారు. 

గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాను ఇబ్రహీంపట్నం  అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోరినట్టు చెప్పారు. ఈ టికెట్టు విషయమై తన కొడుకుతో పాటు  తన స్నేహితుడిని ఢిల్లీకి పంపితే ఈ టికెట్టు విషయమై  తన కొడుకును  రూ. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు.

రూ. 10 కోట్లు తీసుకొని ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న దానం నాగేందర్‌పై కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపిందని  క్యామ మల్లేష్ ఆరోపించారు. భక్తచరణ్ దాస్ తనయుడు తనకు ఇబ్రహీంపట్నం టికెట్టు ఇవ్వడానికి  మూడు కోట్లు ఇవ్వాలని  తన కొడుకును డిమాండ్ చేశారని  ఆయన  డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం  ఏర్పాటు  చేసిన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్  భక్తచరణ్ దాస్  టికెట్ల కేటాయింపులో  డబ్బులు తీసుకొన్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆడియో టేప్‌ను విడుదల చేశారు.

భక్తచరణ్ దాస్ కంటే ముందు నుండే తాను  కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో  తాను  34 ఏళ్ల నుండి  కొనసాగుతున్నట్టు చెప్పారు. నాలాంటి నిజమైన నేతలకు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి, జానారెడ్డికి ప్రజలు బుద్ది చెప్పాలని  ఆయన కోరారు.

ఇబ్రహీంపట్నం లో తన కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయం తీసుకొంటానని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీకి తెలియకుండానే ఈ విషయం తెలియదన్నారు. ఈ విషయం  రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు.

భక్తచరణ్ దాస్ తనయుడు తన కొడుకును టికెట్టు కోసం డబ్బులు అడిగిన విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కకు చెప్పానని..ఆడియో టేపును కూడ విన్పించినట్టు ఆయన చెప్పారు.అయితే ఈ విషయమై తర్వాత మాట్లాడుదామని కాంగ్రెస్ నేతలు తనకు చెప్పారన్నారు.


 

 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

click me!