ఉత్తమ్‌ చేసేవన్నీ బ్రోకర్ రాజకీయాలే... సైదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 15, 2018, 3:18 PM IST
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరు జరిగే నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో నిలవడమే. దీంతో ఇక్కడ ఉత్తమ్ కు గట్టి పోటీనిచ్చే నాయకున్ని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలపాలని భావించి ఇటీవలే శానంపూడి సైదిరెడ్డిని ఎంపికచేశారు. దీంతో తన ఎంపిక ప్రకటన వెలువడిన తర్వాత మొదటిసారి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ పై విరుచుకుపడ్డాడు. 
 
హుజూర్ నగర్ అభివృద్దిని పట్టించుకోకుండా ఉత్తమ్ ఇక్కడ బ్రోకర్ వ్యవస్థ నడుపుతున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అతడిని ఓడించి నియోజకవర్గ అభివృద్ది చేపడతానని హామీ ఇచ్చారు. అందుకోసం నియోజకవర్గ సమస్యలను గుర్తిస్తున్నట్లు...త్వరలోనే స్థానిక మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళతానని సైదిరెడ్డి స్పష్టం చేశారు. 

తనపై నమ్మకంతో హుజూర్ నగర్ సీటు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిలతో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డిలకు కూడా సైదిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

వీడియో

"

click me!