కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

By narsimha lode  |  First Published Nov 15, 2018, 2:56 PM IST

కాంగ్రెస్ పార్టీకీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్  నుండి పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నించారు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్  నుండి పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నించారు. మహా కూటమి(ప్రజాకూటమి) పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటు టీడీపీకి దక్కింది. దీంతో కార్తీక్ రెడ్డి కాంగ్రెన్ పార్టీకి గురువారం నాడు రాజీనామా చేశారు.

రాజేంద్రనగర్‌ సీటు నుండి పోటీ చేయాలని కార్తీక్‌రెడ్డి  రంగం సిద్దం చేసుకొన్నారు. గత ఎన్నికల్లో ఆయన చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేశారు.ఈ దఫా ప్రజాకూటమి పొత్తులో భాగంగా రాజేంద్రసగర్ స్థానం టీడీపీకి వెళ్లింది. 2014 ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.ప్రస్తుతం ఆయన రాజేంద్ర నగర్‌ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు

Latest Videos

దీంతో  రాజేంద్రనగర్ నుండి గణేష్‌గుప్తాను టీడీపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది.  దీంతో  గురువారం నాడు ఉదయం తన అనుచరులతో  కార్తీక్ రెడ్డి సమావేశమయ్యారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పంపారు. తన రాజీనామా ఆమోదిస్తారో.. లేదా  రాజేంద్రనగర్  సీటు ఇస్తారో తేల్చుకోవాలని కార్తీక్ రెడ్డి కోరారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధికి ఎవరితో ఓట్లేసి గెలిపిస్తారో గెలిపించుకోవాలని కార్తీక్ రెడ్డి సవాల్  చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి  కాంగ్రెస్ పార్టీ  కార్యకర్త రాజీనామా చేస్తారని  కార్తీక్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు

 

click me!