ఐదుసార్లు ఎంపీ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా..

By telugu teamFirst Published Jul 28, 2019, 6:53 AM IST
Highlights

1969లో తొలిసారి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి జైపాల్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహించారు.


కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ అనుభవం ఒకసారి పరిశీలిస్తే...

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మాడుగలకు చెందిన జైపాల్ రెడ్డి 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1969లో తొలిసారి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి జైపాల్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహించారు.

1984లో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 19990, 19996లో రాజ్యసభ సభ్యుడిగా  ఎన్నికయ్యారు. జూన్ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభా పక్ష నేతగా వ్యహరించారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు

click me!