హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: బీజేపీ అభ్యర్ధి డాక్టర్ రామారావు

By narsimha lodeFirst Published Sep 27, 2019, 5:37 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

హుజూర్‌నగర్:  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డాక్టర్ కోట రామారావుకు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. ఈ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పెరిక సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కోట రామారావును బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది.

గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన రంగయ్య, నరసమ్మ దంపతులకు 1978, మే, 12 న డాక్టర్ రామారావు జన్మించారు. పీఏసీఎస్ ఛైర్మెన్ గా డాక్టర్  రామారావు తండ్రి రంగయ్య  మూడు దఫాలు ఎన్నికయ్యారు.

ఓ దఫా సాగునీటి సంఘం అధ్యక్షుడిగా కూడ పనిచేశాడు. దీంతో చిన్నప్పటి నుండే తనకు రాజకీయాల గురించి అవగాహాన ఉందని రామారావు చెబుతున్నారు. కాలేజీలో చదువుకొనే సమయంలో  తాను ఏబీవీపీలో పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

పేద ప్రజలకు సేవ చేయాలనే తపనతో మెడిసిన చదివి డాక్టర్ అయినట్టుగా డాక్టర్ రామారావు చెప్పారు.  విదేశాల్లో పనిచేయాలని తన బంధువులు కోరినా కూడ తాను మాత్రం ఇక్కడే ఉండిపోయినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో డాక్టర్ గా పనిచేసినట్టుగా చెప్పారు.

బిల్ గేట్స్ స్థాపించిన మిలిందా గేట్స్ ఫౌండేషన్ లో కూడ కొంత కాలం పాటు పనిచేసినట్టుగా ఆయన ప్రకటించారు.హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రామన్న మా ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకొనేలా పనిచేస్తానని రామారావు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు...

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు..

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

click me!