వారిద్దరి వల్లే భారత జట్టులో ఆ రెండు మార్పులు: విండీస్ కోచ్

By Arun Kumar PFirst Published Oct 26, 2018, 7:47 PM IST
Highlights

వెస్టిండీస్ తో జరగనున్న మిగతా మూడు వన్డేల కోసం టీంఇండియా ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  మొదటి రెండు వన్డేలకు దూరమైన జస్ప్రీత్ సింగ్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లు మిగతా మూడు వన్డేల్లో బరిలోకి దిగనుండగా మహ్మద్ షమీకి జట్టుకుమ దూరమయ్యాడు. ముఖ్యంగా రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక పోవడంతో బౌలింగ్ విభాగంలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే టీంఇండియాలో జరిగిన ఈ మార్పులకు వెస్టిండిస్ కోచ్ స్టువర్ట్ లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వైజాగ్ వన్డేల్లో తమ బ్యాట్ మెన్స్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హెట్మెయర్, హోప్స్ లు తమ బ్యాటింగ్ తో అదరగొట్టారని ఆయన ప్రశంసించారు. వీరు విజృంభిస్తుండటం వల్లే భారత జట్టులో మార్పులు చేసి అనుభవజ్ఞులైన భువనేశ్వర్ కుమార్తో పాటు బుమ్రాలను స్థానం కల్పించారన్నారు. మిగతా మూడు వన్డేలకు వారిని సెలెక్ట్ చేయడానికి కారణాలివే అంటూ స్టువర్ట్ లా వెల్లడించారు. 

ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో వెస్టిండిస్ జట్టు తమ తప్పుతను తామే ప్రశ్నించుకునేదని...కానీ వైజాగ్ మ్యాచ్ తర్వాత తాము జవాబు కూడా చెప్పగలమని అర్థమైందన్నారు. అద్భుతంగా ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపాడు. కోహ్లీ ఎంత అద్భుతంగా ఆడినా ఏదో ఒక సమయంలో తమ ఉచ్చులో చిక్కుకోక తప్పదని పేర్కొన్నారు. మిగతా మ్యాచుల్లో కోహ్లీ అవకాశం ఇచ్చినప్పుడు ఒడిసిపట్టుకుని కట్టడి చేస్తామని స్టువర్ట్ లా తెలిపారు. 

మరిన్ని వార్తలు

మిగతా మూడు వన్డేల నుండి షమీ ఔట్....వారిద్దరు ఇన్....

విశాఖ పిచ్‌పై పూజలు... చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కేపై విమర్శలు

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ

విశాఖ వన్డే టై: హోప్ అద్భుతమైన బ్యాటింగ్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''

click me!