అమృత్‌సర్ రైలు ప్రమాద మృతులకు అక్తర్, అఫ్రిది నివాళులు.. గంభీర్ ధన్యవాదాలు

By sivanagaprasad kodatiFirst Published Oct 26, 2018, 12:16 PM IST
Highlights

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 62 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మృతులకు సోషల్ మీడియా ద్వారా జాతి నివాళులు ఆర్పించింది.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 62 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మృతులకు సోషల్ మీడియా ద్వారా జాతి నివాళులు ఆర్పించింది. ఈ నేపథ్యంలో ఈ దారుణ విషాదంపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్‌లు ట్వీట్టర్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘‘ భారత్‌లో ఇది నిజంగా హృదయ విదారక ఘటన... ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.. వారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని’’ పాక్ డాషింగ్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నాడు. అక్తర్ కూడా ‘‘అమృత్‌సర్ ఘటన తనను బాధించిందని.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు’’ ట్వీట్ చేశాడు.

వీరి ట్వీట్లపై స్పందించిన టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ పాక్ క్రికెటర్లకు ధన్యవాదాలు తెలిపాడు. ‘‘ నాకు అఫ్రిదికి మధ్య గతంలో కొన్ని వివాదాలు చోటుచేసుకుని ఉండొచ్చు.. కానీ అమృత్‌సర్‌లో రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించినందుకు అతనిని నేను అభినందిస్తున్నా... అలాగే షోయబ్ అక్తర్‌కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ గంభీర్ ట్వీట్టర్ ద్వారా రిప్లై ఇచ్చాడు.


 

Really tragic incident in India. Condolences with the affected families may Allah give them the strength to overcome the loss. May Allah protect us all.

— Shahid Afridi (@SAfridiOfficial)

 

While there may be history between me and but i really appreciate his gesture of expressing grief for d families of Amritsar train accident victims. Am sure everyone in India welcomes such gestures. A big thanks to too for his condolences. https://t.co/9HS8MAQO14

— Gautam Gambhir (@GautamGambhir)

అజ్ఞాతం నుంచి రైలు ప్రమాదంపై వేడుకల నిర్వాహకుడి వీడియో ప్రకటన 

వారిని దత్తత తీసుకుంటా, నా భార్యపై విమర్శలా: సిద్ధూ

అమృత్‌సర్ రైలు ప్రమాదం: రాళ్ల దాడికి దిగారు: డ్రైవర్

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?

రైలు ప్రమాదం: చెవుల్లో ఇయర్ ఫోన్స్, డ్రైవర్ తప్పిదమే...

click me!