బిసిసిఐ సీఈవో లైంగిక వేధింపులు... హైకోర్టు జడ్జీ నేతృత్వంలో విచారణ కమిటీ

By Arun Kumar PFirst Published Oct 26, 2018, 3:08 PM IST
Highlights

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘‘మీ టూ’’సెగ ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)ని తాకింది. బిసిసిఐ సీఈవో రాహుల్ జోహ్రీ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఆరోపిస్తోంది. బిసీసీఐ సీఈవో పదవిని చేపట్టడానికి ముందు రాహుల్‌ తనను లైంగికంగా వేధించినట్లు బాధిత మహిళ తెలిపింది. కేవలం తననే కాదు జోహ్రీ ఆంకా కొంతమంది ఆడవారిని వేధించినట్లు సదరు మహిళ సంచలన ఆరోపనలు చేసింది. 
 
ఈ ఆరోపణల నేపథ్యంలో బిసిసిఐ ఇదివరకే అతడిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పష్టత వచ్చేంత వరకూ బిసిసిఐ కార్యకలాపాలతో పాటు ఐసీసీ సమావేశాలకు కూడా  దూరంగా ఉండాలని బీసీసీఐ అతనిపై ఆంక్షలు విధించింది.

తాజాగా అతడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారించేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్‌ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్‌ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్‌పర్సన్‌ బర్ఖాసింగ్‌ లు ఈ విచారణ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.ఈ నివేధిక ఆధారంగా జోహ్రీపై చర్యలుంటాయని బిసిసిఐ తెలిపింది. 

2016లో బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహకాధికారి పదవిని చేపట్టడానికి ముందు జోహ్రీ డిస్కవరీ నెట్‌వర్క్స్‌లో ఓ ఉన్నత హోదాలో పనిచేసేవారు. ఆ సమయంలోనే తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన జోహ్రీ లైంగికంగా వేధించాడని ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా బైటపెట్టింది. ఈ ఆరోపణలతో మీటూ ఎపెక్ట్ బిసిసిఐ కి తాకింది. 
  
 మరిన్ని వార్తలు

బీసీసీఐలో #meetoo.. సీఈవోపై లైంగిక వేధింపులు

click me!