బాబాయ్ ఫోర్ కొడితే.. బాబా సిక్సర్ కొడతారు: కొడుకుతో సానియా ఫన్నీ వీడియో

By Siva KodatiFirst Published Jun 28, 2020, 7:39 PM IST
Highlights

 భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం.. తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు

లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల క్రీడలు వాయిదా పడటంతో క్రీడా ప్రముఖులు కుటుంబంతో గడపటంతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బాగా టచ్‌లో ఉంటున్నారు.

Also Read:నెరిసిన గడ్డంతో.. గుర్తుపట్టలేని విధంగా ధోనీ న్యూలుక్

ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం.. తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సానియా తన కుమారు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు ‘ బాబాయ్ (అసద్) ఫోర్ కొడితే.. బాబా (షోయబ్ మాలిక్) సిక్సర్ కొడతారని సానియా కామెంట్ చేశారు. ఇక ఈ సంభాషణలో సానియా మీర్జా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. దానికి ఇజాన్, బౌబౌ అంటూ కుక్కను అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు.

Also Read:ఆడితే కాల్చి చంపేస్తామన్నారు... భయంతోనే ఆడాను: వర్ణ వివక్షపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

అసద్ బాబాయ్ ఏం చేస్తారని అడిగితే ఫోర్ కొడతారని సానియా బదులిచ్చారు. అదే విధంగా బాబా (షోయబ్ మాలిక్) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్ బాదుతారని సానియా మీర్జా సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో  పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా దీనిని లైక్ చేస్తున్నారు. 

click me!