Asianet News TeluguAsianet News Telugu

ఆడితే కాల్చి చంపేస్తామన్నారు... భయంతోనే ఆడాను: వర్ణ వివక్షపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

అమెరికాలో శ్వేతజాతి పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం ప్రపంచవ్యాప్తంగా జాతి వివిక్ష అంశం మరోసారి తెరపైకి వచ్చింది

Ex Allrounder Phillip DeFreitas Shares Scary Experience Of Racism
Author
London, First Published Jun 28, 2020, 4:11 PM IST

అమెరికాలో శ్వేతజాతి పోలీసుల చేతిలో హత్యకు గురైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం ప్రపంచవ్యాప్తంగా జాతి వివిక్ష అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికీ అతని మృతి పట్ల ప్రపంచంలో ఏదో ఒక మూల వర్ణ వివక్షపై నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి.

వర్ణ వివక్ష అనేది ప్రతీ అంశంలోనూ సామాన్యంగా మారిపోయింది. ఇక క్రీడా ప్రపంచంలోనూ వర్ణ వివక్ష ఉందంటూ పలువురు క్రీడాకారులు వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది.

ఇప్పటికే విండీస్ క్రికెటర్ డారెన్ సామి తాను వర్ణ వివక్షను ఎదుర్కొన్నానని చెప్పాడు. తాజాగా ఆ లిస్ట్‌లో  ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఫిలిప్ డీఫ్రెటిస్ చేరిపోయాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న రోజుల్లో తనకు రెండు, మూడు సార్లు బెదిరింపులు వచ్చాయి.

ఇంగ్లీష్ జట్టుకు ఆడితే కాల్చి చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా సొంత కారు మీద ఉన్న తన పేరును తీసేసుకునేలా చేశారంటే ఏ స్థాయిలో వివక్ష ఎదుర్కొన్నానో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి పరిస్ధితుల్లో ఆటపై దృష్టి పెట్టడం కష్టం.. అయినా తన ప్రతిభతో అలాంటి వారిని దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఇక్కడ బాధించే విషయం ఏంటంటే.. ఇంగ్లాండ్‌కు ఆడుతున్న రోజుల్లో తనకు ఎలాంటి మద్ధతు దక్కలేదని ఫిలిప్ అన్నాడు.

ప్రతి మ్యాచ్‌లోనూ ఏం జరుగుతోందో అనే భయంతోనే ఆడేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్.. 1986-97 మధ్యకాలంలో ఇంగ్లాండ్‌ తరపున 44 టెస్టులు, 103 వన్డేలు ఆడాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios