Asianet News TeluguAsianet News Telugu

నెరిసిన గడ్డంతో.. గుర్తుపట్టలేని విధంగా ధోనీ న్యూలుక్

 భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోజుకోలాగా దర్శనమిస్తున్నాడు. ఒకప్పుడు బాగా హెయిర్ పెంచి.. ఏకంగా పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్‌తో ప్రశంసలు పొందిన హెయిర్ స్టైల్ ఆయనది

former team india skipper ms dhonis new look is bound to stump you
Author
Ranchi, First Published Jun 28, 2020, 5:53 PM IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల క్రీడలు వాయిదాపడటమో, రద్దవ్వడమో జరుగుతున్నాయి. దీనికి క్రికెట్ కూడా అతీతం కాదు. క్షణం తీరిక లేని షెడ్యూల్‌తో గడిపే భారత క్రికెటర్లు సైతం.. లాక్‌డౌన్‌ని కుటుంబసభ్యుల మధ్య గడుపుతున్నారు.

ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోజుకోలాగా దర్శనమిస్తున్నాడు. ఒకప్పుడు బాగా హెయిర్ పెంచి.. ఏకంగా పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్‌తో ప్రశంసలు పొందిన హెయిర్ స్టైల్ ఆయనది.

Also Read:కూతురితో ధోనీ బైక్ రైడ్... వీడియో వైరల్

కానీ ధోని ప్రస్తుతం తన జుట్టు గురించి కేర్ తీసుకోవడం లేదు. తాజాగా నెరిసిన గడ్డంతో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు ధోనీ. మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మిస్టర్ కూల్.. లాక్‌డౌన్ సడలింపులు వచ్చినా లుక్ మార్చడం లేదు.

పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయిస్తున్నారు ధోనీ. అక్కడే సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తూ.. కుమార్తెతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Also Read:ధోనీకి నిద్రలో కూడా అదే పిచ్చి.. అభిమానులతో సాక్షి

నెరిసిన గడ్డంతో ఫామ్‌హౌస్‌లో విత్తనాలు చల్లుతూ, రైతులతో మాట్లాడుతున్న ధోనీ ఫోటోలు ఇటీవలి కాలంలో వైరల్ అయ్యాయి. అయితే పుట్టినరోజు నాటికైనా మహేంద్రుడు తన లుక్‌ని మార్చాలని కొంతమంది అభిమానులు సూచిస్తుండగా.. ఈ లుక్ కూడా బాగుందని ఇంకొందరు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు జూలై 7న 39వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు ధోనీ. ట్విట్టర్‌లో ఇప్పటికే #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios