RCB vs GT : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విల్ జాక్స్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్ కు దిమ్మదిరిగి పోయింది. విల్ అద్భుతమైన సెంచరీతో 9 వికెట్ల తేడాతో జీటీని ఆర్సీబీ చిత్తు చేసింది.
Royal Challengers Bangalore vs Gujarat Titans : 6,6,4,6... చివరి రెండు ఓవర్లలో 57 పరుగులతో విధ్వంసం సృష్టించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్. విల్ జాక్స్, విరాట్ కోహ్లీ దెబ్బకు గుజరాత్ టైటాన్స్ కు దిమ్మదిరిగిపోయింది. గుజరాత్ లో విల్ జాక్స్ మెరుపులు మెరిపిస్తూ తన ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీని సాధించాడు. విల్ జాక్స్, విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో ఆర్సీబీకి ఇది మూడో విజయం. గత మ్యాచ్లో హైదరాబాద్ పై విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చిన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 45వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు 400+ పరుగులు సాధించాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. విల్ జాక్స్ సూపర్ సెంచరీ, విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో 16 ఓవర్లలోనే ఆర్సీబీ విజయం అందుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
సారా టెండూల్కర్ తో బ్రేకప్? శుభ్‌మన్ గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్?
విల్ జాక్స్ విధ్వంసం.. రెండో ఓవర్లలోనే 57 పరుగులు..
ఈ మ్యాచ్ లో బెంగళూరు ప్లేయర్ విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. విరాట్ కోహ్లీతో కలిసి బెంగళూరుకు విజయాన్ని అందించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లలపై విల్ జాక్స్ విరుచుకుపడ్డాడు. విల్, విరాట్ దెబ్బకు గుజరాత్ బౌలర్లు బిత్తరపోయారు. కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, విల్ జాక్స్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని తర్వాత మరింతగా రెచ్చిపోతూ వరుస బౌండరీలతో అదరగొట్టాడు. సెంచరీ పూర్తి చేసుకుని ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. విల్ జాక్స్ 41 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు సాధించాడు.
First 50 in 31 balls, next 50 in just 10 balls 🤯
Will Jacks, you beast 🙇♂️ pic.twitter.com/NiKaaHpifv
విల్ జాక్స్ తొలి సెంచరీ..
41 బంతులు ఎదుర్కొని విల్ జాక్స్ ఐపీఎల్ లో తన తొలి సెంచరీని సాధించాడు. 32 ఏళ్ల ఈ ప్లేయర్ 240+ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 41 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మోహిత్ శర్మ 15వ ఓవర్ వేయడానికి వచ్చాడు. వరుస బౌండరీలు బాదుతూ ఈ ఓవర్‌లో విల్ జాక్వెస్ 29 పరుగులు చేశాడు. దీని తర్వాత, చివరి ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆర్సీబీ గెలుపునకు 29 పరుగులు అవసరం. అటువంటి పరిస్థితిలో, 16వ ఓవర్‌లో 4 సిక్సర్లు, 1 ఫోర్ సహాయంతో 29 పరుగులు పిండుకుని విల్ జాక్స్ ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. గుజరాత్ స్టార్ బౌలర్లు మోహిత్ శర్మ, రషీద్ ఖాన్‌లను విల్ జాక్స్ తన అద్భుత బ్యాటింగ్ తో చెడుగుడు ఆడుకున్నాడు.
6.41 PM - Will Jacks 50.
6.47 PM - Will Jacks 100.
Our 6️⃣ hitting menace took only 6️⃣ minutes. 🙇♂️ pic.twitter.com/UTXl8HWJ05
విల్ జాక్స్ సూపర్ సెంచరీ.. కోహ్లీ ధనాధన్ ఇన్నింగ్స్.. గుజరాత్ పై బెంగళూరు గెలుపు