మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 11:43 AM IST
Highlights

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించిన వివాదం భారత క్రికెట్‌లో పెను వివాదానికి దారి తీస్తోంది. జట్టు స్వదేశానికి వచ్చిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్, కోచ్ రమేశ్ పొవార్, జట్టు మేనేజర్ తృప్తి భట్టాచార్యలతో విడివిడిగా మాట్లాడిన బీసీసీఐ ఒక్కొక్కరి నుంచి వివరణ తీసుకుంది. 

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించిన వివాదం భారత క్రికెట్‌లో పెను వివాదానికి దారి తీస్తోంది. జట్టు స్వదేశానికి వచ్చిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్, కోచ్ రమేశ్ పొవార్, జట్టు మేనేజర్ తృప్తి భట్టాచార్యలతో విడివిడిగా మాట్లాడిన బీసీసీఐ ఒక్కొక్కరి నుంచి వివరణ తీసుకుంది.

పర్యటనలో తనను అడుగడుగునా పొవార్ అవమానించినట్లుగా మిథాలీ బీసీసీఐకి ఈ మెయిల్ పంపారు. దీనిపై స్పందించిన రమేశ్ పొవార్.. ఆమె దూరంగా ఉండేదని.. మిథాలీతో వ్యవహరించడం కష్టమని చెప్పాడు.

స్ట్రయిక్ రేట్ పేలవంగా ఉండటంతోనే ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో తప్పించారని.. ఆసీస్‌తో ఆడిన జట్టునే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు కొనసాగించారని ఆయన అన్నారు.  మిథాలీని జట్టులోంచి తప్పించాలంటూ బీసీసీఐలోని అత్యంత శక్తిమంతుల నుంచి తనకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని స్పష్టం చేశారు.

మరో వైపు ఈ వివాదం కారణంగా భారత క్రికెట్ ప్రతిష్ట మసకబారుతోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మహిళల క్రికెట్ జట్టు వైఖరిపై మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా కోచ్ రమేశ్ పవార్‌ను చిక్కుల్లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి.

కోచ్‌గా ఆయన పదవి కాలం శుక్రవారంతో ముగుస్తుంది. రమేశ్ కాంట్రాక్టును మరికొంతకాలం పొడిగించడానికి కానీ.. లేదంటే ఆయనకే మరోసారి అవకాశం ఇచ్చేందుకు గానీ బీసీసీఐ అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు ఆయన దరఖాస్తు చేసుకుంటారని తెలుస్తోంది. 

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

మిథాలీ తొలగింపు వివాదం: హార్మన్‌ను వివరణ కోరనున్న బీసీసీఐ

అరవంలో అదరగొడుతున్న ధోని కూతురు

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్
 

click me!