నిక్కరుతో టాస్‌...మరో వివాదంలో విరాట్ కోహ్లీ

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 9:34 AM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం షార్ట్ వేసుకుని వెళ్లాడు విరాట్.. దీనిపై ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రపంచం మండిపడింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం షార్ట్ వేసుకుని వెళ్లాడు విరాట్.. దీనిపై ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రపంచం మండిపడింది. మ్యాచ్‌కు ముందు కోహ్లీ, ఆసీస్ ఎలెవన్ కెప్టెన్, రిఫరీ టాస్‌కి హాజరయ్యారు.

దీనికి కోహ్లీ షార్ట్ వేసుకుని వెళ్లాడు... ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్వీట్టర్లో పెట్టిన వెంటనే నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జెంటిల్మెన్ గేమ్‌గా ప్రఖ్యాతి గాంచిన క్రికెట్ హుందాతనాన్ని కాపాడాల్సిన క్రికెటర్లు ఇలా చేయకూడదన్నారు.. విరాట్ క్రికెట్‌ను అగౌరవపరిచాడని, అతడికి ఆట పట్ల గౌరవం లేదని మండిపడ్డారు.

అంతకు ముందు సోషల్ మీడియాలో నీ ఆట నాకు నచ్చదు.. నీకన్నా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల బ్యాటింగ్ ఇష్టమన్న అభిమానిని నువ్వు ఈ దేశంలో ఉండటానికి అనర్హుడివి అంటూ కోహ్లీ అన్న వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. దీనిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల ప్రముఖులు విరాట్‌పై మండిపడ్డారు.

 

CA XI have won the toss and will field first pic.twitter.com/J8fb8BJp8x

— BCCI (@BCCI)

విరాట్ కోహ్లీపై బిషన్ సింగ్ విమర్శలు 

మన రామ్.. విరాట్ కోహ్లీ లా కనిపిస్తున్నాడే!

సారీ.. నన్ను బ్యాన్ చేయకండి.. విరాట్ కోహ్లీ

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

కోహ్లీలో నిగ్రహం లేదు.. నోరు జారుతున్నాడు: విశ్వనాథన్ ఆనంద్

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ...ఎందుకలా అన్నానంటే...

కోహ్లీ అన్నదాంట్లో తప్పేముంది..? మద్దతుగా నిలిచిన కైఫ్

కోహ్లీ నోట ఇలాంటి మాటలా.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆవేదన

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

click me!