కేటీఆర్ సీఎం కుర్చీకి గండం: మమత షాక్... కేసీఆర్ వద్దు జగన్ ముద్దు

By telugu teamFirst Published Jan 7, 2020, 4:44 PM IST
Highlights

దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పి ఆర్ ఇతరయాత్రల గొడవలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటితోపాటు మునిసిపల్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ అన్నిటికి మించి కెసిఆర్ తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేద్దామనుకుంటున్నాడా అనే చర్చ. 

దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పి ఆర్ ఇతరయాత్రల గొడవలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటితోపాటు మునిసిపల్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ అన్నిటికి మించి కెసిఆర్ తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేద్దామనుకుంటున్నాడా అనే చర్చ. 

ప్రజలు, మీడియా సంస్థలు ఇలా అనుకోవడానికి ఆస్కారం కల్పించినవి మీడియా లీకులే. మీడియా లీకులతోపాటు మంత్రుల్లో చాలామంది పోటీలుపడి మరీ కేటీఆరే తదుపరి సీఎం అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. 

ఏదో తమ స్వామి భక్తి ప్రదర్శించుకుంటున్నారులే అని అనుకోవడానికి లేదు. ఒకవేళ ఇలాంటి మద్దతులు తెలపడం మామూలుగా సాగి ఉంటె ఎవరో ఒకరు హరీష్ కి అనుకూలంగా కూడా మాట్లాడేవారు. అది అప్పుడు తెరాస పార్టీకే ఎసరు తెచ్చేదిగా మారేది. 

కానీ అలా కాకుండా అందరూ కూడా కేటీఆర్ కే మద్దతు తెలపడం ఇక్కడ తెరాస లో జరగబోతున్న అధికార బదిలీ గురించి చెప్పకనే చెబుతుంది. దీనిపైన కెసిఆర్ మాత్రం మౌనం వీడడం లేదు. 

Also read: బహిరంగంగా ఈటల.. లోలోపల హరీష్ .. జగన్‌కు షాక్ ఇచ్చే పనిలో నటుడు

మరోపక్క పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని కొందరు ముఖ్యమంత్రులు స్వాగతిస్తుంటే...బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో కొందరు ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని తెగేసి చెబుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షమైన నితీష్ కుమార్ కూడా ఈ చట్టాన్ని బీహార్ లో అమలు చేసేది లేదని తెగేసి చెప్పాడు. 

ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఏకంగా భారీ ర్యాలీ నిర్వహించిమరీ ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. అంతటితో ఆగకుండా నరేంద్ర మోడీ, అమిత్ శాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పౌరసత్వ చట్టానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేసినప్పటికీ ఎన్నార్సిని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేదే లేదని తేల్చి చెప్పాడు. 

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేది లేదని అన్నాడు. తెలంగాణాలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతూ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ తీవ్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. 

ఇక తాజాగా బయటకొచ్చిన ఎన్ పి ఆర్ విషయంలో కానీ, ఎన్నార్సి విషయంలో కానీ కెసిఆర్ ఎం మాట్లాడడం లేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయడం మినహా తెరాస బయట ఎక్కడా కూడా ఈ విషయం పై పెదవి మెదిపింది లేదు. 

 ఎన్ పి ఆర్ ను వ్యతిరేకిస్తున్నట్టు కూడా ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే మాట అన్నారు. వారు బీజేపీయేతర ముఖ్యమంత్రులకు   ఎన్ పి ఆర్ ను కూడా వ్యతిరేకించాలని లేఖలు రాసారు. 

Also read: సీఎంగా కేటీఆర్: కేసీఆర్ వ్యూహం ఇదేనా...

అందరు బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు రాసినప్పటికీ, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసేలా విప్ జారీ చేసిన తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రం వారు లేఖ రాయలేదు. 

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా వారు లేఖ రాసారు. కానీ కెసిఆర్ కు మాత్రం రాయలేదు. పోనీ పినారయి విజయన్ అంటే సిపిఎం పార్టీ నేత కాబట్టి తెలంగాణలో ఎమన్నా రాజకీయ ఆశలు ఉన్నాయేమో అని అనుకోవచ్చు. 

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకయితే తెలంగాణతో సంబంధం లేదు కదా! కనీసం ఆమె అయినా లేఖ రాయాలి కదా. ఇంకో విషయం ఏమిటంటే...పార్లమెంటు ఎన్నికలకు ముందు కెసిఆర్ వీరందరని కలిసి ఫెడరల్ ఫ్రంట్ అని కూడా తిరిగారు. అలంటి కెసిఆర్ ని ఇప్పుడు వీరు నమ్మట్లేదా? బీజేపీ తో కెసిఆర్ ఇంకా ఓపెన్ గా యుద్ధం ప్రకటించకుండా అంతర్గత మైత్రిని కొనసాగిస్తున్నారా? అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

బీజేపీతో కెసిఆర్ ప్రస్తుతానికి వైరం కొనసాగిస్తున్నట్టు మనకు అనిపిస్తున్నప్పటికీ, కెసిఆర్ మాత్రం కేంద్రం తో నేరుగా వైరం ఎందుకు అని ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం మీద కానీ లేదా  ఎన్ పి ఆర్ మీద కానీ కెసిఆర్ ఎం మాట్లాడినా కూడా అది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లకు అస్త్రాలు అవుతాయి. 

ఇంత జరుగుతున్న కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారు. ఒక వైపు కాంగ్రెస్ ఏమో బిల్లుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్నట్టు వ్యతిరేక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తుండగా... బీజేపీ ఏమో కెసిఆర్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసాడని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. 

ఇంతమంది ఇన్ని విధాలుగా కెసిఆర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ కెసిఆర్ మాత్రం మౌనం వీడడం లేదు. ఆయన నోరు మెదపకుండా ఉండడానికి కారణమేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Also read: CAA: కేసీఆర్ మౌనం వెనక వ్యూహం ఇదీ...

కెసిఆర్ ని జాతీయ నాయకులూ ఎందుకు నమ్మడంలేదనేది ఇక్కడ ఇప్పుడు ఉద్భవిస్తున్న అతిపెద్ద ప్రశ్న. కెసిఆర్ గనుక అవసరం వస్తే బీజేపీతో కలుస్తాడని వీరంతా నమ్ముతున్నట్టు కనబడుతుంది. 

ఈ రెండు సంఘటనలు చూడడానికి వేరువేరుగా కనబడుతున్నప్పటికీ, కలిపి చూస్తే జరగబోయే నష్టం మనకు పూర్తిగా అవగతమవుతుంది. కెసిఆర్ ను గనుక జాతీయ నాయకులు నమ్మకపోతే ఆయన ఫెడరల్ ఫ్రంట్ కి శుభం కార్డు పడ్డట్టే. 

ఇదే గనుక జరిగితే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ఢిల్లీలో చక్రం తిప్పాలనుకునే ఆశలపై నీళ్లు చెల్లినట్టే! కెసిఆర్ అక్కడకు వెళ్లి ఇక్కడ కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగిద్దామనుకునే ఆలోచనకు బ్రేకులు వేయాల్సి వస్తుంది. చూడాలి ఈ తరుణంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.... 

click me!