తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీలో  సైలెంట్‌గా ఎదో జరుగుతోంది. కొందరు నేతలు ఆసంతృప్తిగా ఉన్నప్పటికీ వారు మాత్రంబయపడడం లేదు. పార్టీలోని కొందరి పెద్దల నిర్ణయాలు  ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. కాకపోతే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అవన్నీ కనిపించడం లేదు. ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన వైసీపీ నేతల్లో ఈ ఆసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెరాసలోని సీనీయర్ నేతల్లో  తీవ్రమైన అసంతృప్తే  ఉంది.

మోడీతో మోహన్ బాబు భేటీ  

తాజాగా  సినీనటుడు మోహన్ బాబు మోడీని కలవడంతో ఆ వార్తలకు బలం చేకూర్చింది. తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన మోహన్ బాబు ఆ తర్వాత రాజసభ సభ్యుడిగా ఆ పార్టీ నుంచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కాలానంతరం ఆయన రాజకీయాల వైపు  తిరిగి చూడడం మానేశారు. అడపదడపా  రాజకీయాలపై వ్యాఖ్యలు చేసినా..  ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. 

కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?

అయితే 2018 ఎన్నికల్లోపాలిటిక్స్‌లోకి రీఎంట్రి ఇచ్చారు. ఏపీ ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మోహన్ బాబు. అంతకు ముందు  రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని ఇరుకునే పెట్టి ప్రయత్నం చేశారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల నిధులు విడుదల చేయాలంటూ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. కొద్దీ రోజుల తర్వాత వైసీపీలో చేరారు.

ప్రధానిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు పలు ప్రశ్నలను దాటవేశారు. బీజేపీలోకి మోదీ మీమ్మల్ని అహ్వనించరా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.  అయితే మోహన్ బాబుకు వైసీపీకి దక్కబోయే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి తనకు దక్కుతుందని   అశించినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ జాబితాలో ఆయన పేరు లేనట్లు తెలుస్తోంది. అదే అతని అసంతృప్తికి కారణమైనట్లు సమాచారం.

బీజేపీ నేతలతో క్లోజ్‌గా రఘరామ కృష్టంరాజు

వైసిపిలో ఆసంతృప్తిగా ఉన్న మరో నేత రఘరామ కృష్టంరాజు. ఈ మధ్య ఆయన బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ వ్వహరాలలో అంటి ముట్టినట్లుగా వ్వవహరిస్తున్నారు. ఈ మధ్య లోక్‌సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఈ వైసీపీ అంశం వైసీపీ పెద్దలకు ఆయనపై ఆగ్రహం తెప్పించేలా చెసింది.

ఇక పార్లమెంట్‌లో ప్రధాని మోదీ రఘురామ కృష్ణంరాజును పలకరించడం.దానికి ప్రతిగా , ఆయన ప్రధానికి నమస్కరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తర్వాత ఆయన జగన్‌ను కలిసి వివరణ ఇచ్చానా పార్టీలో ఆయన వ్యవహరం అనుమానస్పదంగానే ఉంది. వ్యాపార కార్యకలపాల దృష్ట్యా బీజేపీకి ఆయన క్లోజ్‌‌గా ఉంటున్నారనట్లుగా సమాచారం. ఆయన త్వరలోనే బీజేపీ \ తీర్థం పుచ్చుకునే అవకాశలు ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. 

సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?


టీఆర్ఎస్‌లోనూ ఆసంతృప్తి 

ఇక తెలంగాణ విషయానికి వస్తే అధికార పార్టీ తెరాసలోను ఆసంతృప్తి ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సీనయర్ నేతలైన హరీష్ రావు, నాయిని, ఈటల పార్టీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలో కష్టపడ్డ వీరికి  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ప్రాధన్యం తగ్గడం వారిని నైరశ్యంలోకి వెళ్ళేలా చెసింది. పార్టీలో కేటీఆర్ కొటరీ పెరుగుపోతుండడం, తర్వాత సీఎం కేటీఆరే  అంటూ  జరగుతున్న ప్రచారం  వారిలో నిరుత్సాహన్నిపెంచుతోంది. అన్నీ పరిణామాలను గమినిస్తున్న ఈటెల బహిరంగగానే తన పార్టీపై విమర్శలు  చెస్తున్నారు. హరీష్ బయటకు కనిపించకపోయిన  లోలోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.