రాజకీయంగా, చట్టపరంగా పెద్ద చర్చలు జరుగుతున్న టైంలో వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల రికార్డులన్నీ డిజిటల్‌లో భద్రపరచాలి. వక్ఫ్ ఆస్తుల వివాదాల పరిష్కారానికి టైమ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు.
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 అధికారికంగా ఇవాళ్టి నుండి అంటే ఏప్రిల్ 8 మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం అమలులోకి వచ్చిన తేదీని న్యాయ, మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసింది
భారతదేశంలోని వక్ఫ్ బోర్డుల పాలనను మార్చే లక్ష్యంతో ఉన్న ఈ చట్టాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించారు. ఏప్రిల్ 3న లోక్ సభలో, ఆ తర్వాత ఏప్రిల్ 4న రాజ్యసభలో 13 గంటల పాటు చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, పరిపాలనను మెరుగుపరచడానికి, జవాబుదారీతనం ఉండేలా చూసేందుకే ఈ సవరణలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ చట్టం మైనారిటీల హక్కులను దెబ్బతీస్తుందని, మతపరమైన వాటిపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడానికి దారి తీస్తుందని ప్రతిపక్ష పార్టీలు, చాలా ముస్లిం సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, పాలనను మెరుగుపరచడానికి చాలా మార్పులు చేసింది. వక్ఫ్ బోర్డులకు ఎప్పటికప్పుడు ఆడిట్ చేయడం, ఆర్థికపరమైన తప్పులు చేస్తే లేదా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
స్థానిక వక్ఫ్ నిర్వహణ కమిటీల కూర్పులో కూడా మార్పులు చేశారు. దాతల కుటుంబాల నుంచి, లబ్ధిదారుల నుంచి ప్రతినిధులను నియమించాలని చట్టం చెబుతోంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే విధానంలో జవాబుదారీతనం, అందరికీ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
వక్ఫ్ ఆస్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెబుతోంది. అవినీతి, కోర్టు కేసులు, పరిపాలనాపరమైన సమస్యల వల్ల చాలా ఆస్తులు ఉపయోగంలో లేకుండా ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ ఆస్తులను సరిగ్గా చూసుకుంటే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజం కోసం ఖర్చు చేయొచ్చని, ముఖ్యంగా మహిళల అభివృద్ధికి ఉపయోగించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని ముఖ్యమైన సవరణలు:
వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టం చెబుతోంది.
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అభ్యర్థనను దాఖలు చేసింది. తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తమ వాదనలు కూడా వినాలని ఒక వ్యక్తి కోర్టుకు చేసే విజ్ఞప్తిని కేవియట్ అంటారు.
ఈ సంస్కరణల వల్ల మంచి పాలన అందుతుందని, ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంటే, ముస్లింలు కానివారిని, మహిళలను వక్ఫ్ బోర్డుల్లోకి తీసుకోవడం వల్ల మతపరమైన సంస్థల స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లుతుందని విమర్శకులు అంటున్నారు.