Published : Mar 22, 2025, 09:02 AM ISTUpdated : Mar 22, 2025, 11:39 PM IST

Telugu news live updates: KKR vs RCB: కేకేఆర్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. దుమ్మురేపిన కోహ్లీ !

సారాంశం

ఈ రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక బెట్టింగ్‌ యాప్స్‌ కేసు విచారణ కొనసాగుతోంది. అలాగే ఐపీఎల్‌లో నేడు తొలి మ్యాచ్‌ జరగనుంది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. వీటితోపాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

Telugu news live updates: KKR vs RCB: కేకేఆర్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. దుమ్మురేపిన కోహ్లీ !

11:39 PM (IST) Mar 22

KKR vs RCB: కేకేఆర్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. దుమ్మురేపిన కోహ్లీ !

KKR vs RCB: శనివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లో కోహ్లీ అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. సూప‌ర్ బ్యాటింగ్ తో త‌న జ‌ట్టు ఆర్సీబీకి విజ‌యాన్ని అందించాడు. 
 

పూర్తి కథనం చదవండి

10:26 PM (IST) Mar 22

ఐపీఎల్ 2025: షారూక్ ఖాన్ కి మిగతా స్టార్లకు తేడా ఇదే!

షారుఖ్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 18వ ఎడిషన్‌ను ప్రారంభించారు. శ్రేయా ఘోషల్, దిశా పటానీ వంటి స్టార్ పెర్ఫార్మర్‌లను పరిచయం చేశారు.

పూర్తి కథనం చదవండి

08:32 PM (IST) Mar 22

డీలిమిటేషన్ తో 272 ఎంపీ సీట్లు పెరిగే ... మాకు 272 సీట్లు కావాల్సిందే : రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

నియోజకవర్గాల డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

పూర్తి కథనం చదవండి

07:22 PM (IST) Mar 22

బాత్రూమ్ డ్రెయిన్‌లో చిక్కుకున్న వెంట్రుకలను తొలగించాలా? సింపుల్ టిప్స్ ఇవిగో!

Bathroom Drain: బాత్రూమ్ డ్రెయిన్‌లో వెంట్రుకలు చిక్కుకుపోయి తరచూ నీరు ఆగిపోతూ ఉంటుంది కదా..  ఈ వెంట్రుకలను తొలగించడానికి ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తొలగించవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.

పూర్తి కథనం చదవండి

07:21 PM (IST) Mar 22

IPL 2025: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా శ్రేయా ఘోషల్‌ తెలుగు సాంగ్‌

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్‌ ప్రారంభమైంది. ఐపీఎల్‌ 2025 స్టార్టింగ్ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగాయి... 
 

పూర్తి కథనం చదవండి

07:17 PM (IST) Mar 22

చిరంజీవినే క్రమశిక్షణలో పెట్టిన మోహన్ బాబు అంటూ ఏకిపారేసిన అన్వేష్.. రానా, ప్రకాష్ రాజ్ ల పరువు తీస్తూ

ప్రపంచ యాత్రికుడిగా నా అన్వేషణ అన్వేష్ టాప్ యూట్యూబర్ గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు ప్రపంచ యాత్రలు చేస్తూనే మరోవైపు సమాజంలో జరుగుతున్న అంశాలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు అన్వేష్.

పూర్తి కథనం చదవండి

06:34 PM (IST) Mar 22

Summer Tips: వేసవిలో ప్రతి నీటి బొట్టు బంగారమే.. నీటిని పొదుపుగా వాడేందుకు సింపుల్ టిప్స్

Summer Tips: వేసవి వచ్చిందంటే మనం నీటి కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాగడానికే సరైన నీళ్లు లేక మంచి నీటి కోసం వందల రూపాయలు ఖర్చు పెడతాం కదా.. కాని ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఉన్న తక్కువ నీటినే అవసరాలకు సరిపడేలా వాడుకోవచ్చు. ఈ టిప్స్ పాటించి ఈ సమ్మర్ లో వాటర్ సమస్య నుంచి బయటపడండి. 

 

పూర్తి కథనం చదవండి

06:33 PM (IST) Mar 22

Petrol Bunk : పెట్రోల్, డీజిల్ కొట్టించుకోడమే కాదు... పెట్రోల్ బంకులను ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

మనం పెట్రోల్ బంక్ కు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు కోసమే వెళుతుంటాం. కానీ పెట్రోల్ బంకుల్లో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి... వాటిని ఎవ్వరైనా ఉచితంగా పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

06:09 PM (IST) Mar 22

Betting Apps: టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన అన్వేష్.. దమ్ముంటే రమ్మంటూ ఛాలెంజ్‌

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోట్‌ చేసిన ప్రముఖులపై కేసులు నమోదు కాగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెట్టింగ్‌ యాప్స్ విషయంలో యూట్యూబర్‌ నా అన్వేష్‌ చుట్టూ కథ తిరుగుతోంది. బెట్టింగ్‌ యాప్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.. 
 

పూర్తి కథనం చదవండి

05:16 PM (IST) Mar 22

పెళ్ళైన హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న నితిన్, సాయి పల్లవి హ్యాండిచ్చినట్లే

నితిన్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఒక రేంజ్ లో హైప్ ఇస్తున్నాడు. బలగం వేణు దర్శకత్వంలో నటించబోతున్న ఎల్లమ్మ చిత్రం గురించి అయితే నితిన్ చేస్తున్న వ్యాఖ్యలు అంచనాలు పెంచేస్తున్నాయి.

పూర్తి కథనం చదవండి

05:10 PM (IST) Mar 22

IPL: భార‌త ప్లేయర్లు వేరే కంట్రీ క్రికెట్ లీగ్స్ ఎందుకు ఆడ‌రు?

Indian Premier League (IPL): ఐపీఎల్ లో చాలా మంది విదేశీ ప్లేయ‌ర్లు ఆడ‌తారు. అయితే, భార‌త ప్లేయ‌ర్లు విదేశీ క్రికెట్ లీగ్ ల‌లో ఎందుకు ఆడ‌రు? 
 

పూర్తి కథనం చదవండి

05:08 PM (IST) Mar 22

YS Jagan: ప్రధాని మోదీకి లేఖ రాసిన జగన్‌.. ఏ విషయాలను ప్రస్తావించారంటే

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ) పై దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న సమయంలో జగన్‌ ఈ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆధ్వర్యంలో శనివారం పలు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. 
 

పూర్తి కథనం చదవండి

04:47 PM (IST) Mar 22

IPL లో అంపైర్ల జీతం: ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారు?

IPL Umpires' salary: క్రికెట్‌లో అంపైర్లు మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. క్రికెట‌ర్ల‌తో పాటు అంపైర్లు కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కో మ్యాచ్‌కు అంపైర్లు ఎంత పారితోషికం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

04:18 PM (IST) Mar 22

చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన నటీనటులు, తెలుగులో ఆమెకి 2 బ్లాక్ బస్టర్ చిత్రాలు 

సుశాంత్ సింగ్ నుండి మధుబాల వరకు చిన్న వయసులో చనిపోయిన బాలీవుడ్ ప్రముఖులు, వాళ్ళ మరణాల గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

04:02 PM (IST) Mar 22

హైదరాబాద్‌లో ఎవరికీ తెలియని అద్భుతం.. 100 ఎకరాల్లో మొదటి ఏఐ పార్క్‌. ఈ వీకెండ్‌కి ప్లాన్‌ చేయండి.

Hyderabad AI Park: 500 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ మహా నగరంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి సుందర నిర్మాణాలను, పర్యటక ప్రదేశాలను సందర్శిచేందుకు దేశవిదేశాల నుంచి ప్రతీ రోజూ వేలల్లో పర్యాటకులు వస్తుంటారు. హైదరాబాదీలను ఆకట్టుకుంటోన్న ఓ ప్రత్యేక ప్రదేశానికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:49 PM (IST) Mar 22

Fake Bank : వీడెవడండీ బాబూ... జాబ్ ఇవ్వలేదని ఏకంగా ఫేక్ ఎస్బిఐ బ్యాంకునే పెట్టేసాడా!

ఇటీవల బ్యాంక్ సిబ్బంది పేరిట ఫోన్లు చేసి మోసాలకు పాల్పడటం చూస్తున్నాం... కానీ ఏకంగా ఓ పేక్ బ్యాంకునే పెట్టి మోసాలకు పాల్పడ్డాడో ప్రభుద్దుడు. ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... 

పూర్తి కథనం చదవండి

03:37 PM (IST) Mar 22

Camera Smartphones: కెమెరీ ఫీచర్స్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు.. ధర రూ.15,000 లోపే!

Camera Smartphones: సెల్ ఫోన్ మార్కెట్ లోకి వస్తున్న కొత్త ఫోన్లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. అయితే వాటి ధర కూడా తక్కువగానే  ఉంటున్నాయి. ప్రస్తుతం 

పూర్తి కథనం చదవండి

02:56 PM (IST) Mar 22

కాస్మెటిక్ బిజినెస్ నడుపుతున్న నటీమణులు..సన్నీలియోన్, దీపికా, ప్రియాంక చోప్రా ఇంకా ఎవరెవరంటే

భారతదేశంలో కాస్మెటిక్స్ మార్కెట్ బాగా ఫేమస్. ఇక్కడ చాలామందికి స్కిన్‌కేర్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువ. లేడీ గగా, రిహన్నా లాంటి స్టార్లు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వాళ్ల బ్యూటీ బ్రాండ్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ ఇండియన్ సెలబ్రిటీలు వాళ్ల ఫ్యాన్స్‌కి సూపర్ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

02:33 PM (IST) Mar 22

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ ఎలా పని చేస్తాయి? నిజంగానే డబ్బులు ఊరికే వస్తాయా.? భయంకరమైన నిజాలు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంత మంది సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయర్స్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తూ ఎంతో మంది మరణాలకు కారణమయ్యారన్న అంశం కుదిపేస్తోంది. పోలీసుల విచారణలో తెలియక తప్పు చేశామంటూ బుకాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలీ బెట్టింగ్‌ యాప్స్‌ ఎలా రన్‌ అవుతున్నాయి.? వీటి వెనక జరిగే మోసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:04 PM (IST) Mar 22

ఆ బాబా వల్లే చిరంజీవి నెంబర్ 1 అయ్యారా..పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన మెగాస్టార్, కోపం వస్తే అంతే

సాయం అడిగితే వెంటనే స్పదించే చిరంజీవి తన పేరుని దుర్వినియోగం చేస్తే మాత్రం అసలు ఊరుకోరట.

పూర్తి కథనం చదవండి

01:49 PM (IST) Mar 22

Rains : ఈ రెండ్రోజులు వానలే వానలు... ఈ తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వర్షసూచన, తస్మాత్ జాగ్రత్త

మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి... మరో రెండుమూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

01:46 PM (IST) Mar 22

Garlic Over consumption: వేసవిలో వెల్లుల్లి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే..

Garlic Over consumption: వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చాలా మంది ప్రతి రోజు ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటారు. కాని వేసవిలో వెల్లుల్లి ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

01:23 PM (IST) Mar 22

Cleanest Cities పరిశుభ్రత అంటే ఈ నగరాలదే.. మనకూ చోటుందా మరి?

పరిశుభ్రంగా ఉంటే నగరాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. అలా ఉంటే ఎవరైనా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవాలనుకుంటారు. మరి 2025 నాటికి భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాలు ఏంటో మీకు తెలుసా? మన దేశంలో చూడటానికి చాలా అందమైన నగరాలున్నాయి. మధ్యప్రదేశ్ నుండి గుజరాత్ వరకు ప్రతి ప్రదేశానికి దాని ప్రత్యేక ఆకర్షణ ఉంది. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం!

పూర్తి కథనం చదవండి

01:16 PM (IST) Mar 22

ఐశ్వర్య ఫోన్ కాల్స్ అంటే అభిషేక్‌కి టెన్షనా? ఏం చెప్పాడంటే!

ఐశ్వర్య రాయ్ నుండి వచ్చే అనే ఫోన్ కాల్స్ తనను ఎంత ఆందోళనకు గురిచేస్తాయో అభిషేక్ బచ్చన్ సరదాగా చెప్పాడు. ఈ జంట పెళ్లయి పదిహేడేళ్లు అయింది.

పూర్తి కథనం చదవండి

01:03 PM (IST) Mar 22

WhatsApp Business: వాట్సాప్ బిజినెస్ టెక్నిక్స్ పాటిస్తే మీ వ్యాపారం లాభాలతో దూసుకుపోతుంది

WhatsApp Business: ఇప్పుడు ట్రెండ్ మారింది. బిజినెస్ మార్కెటింగ్ అంతా ఇప్పుడు వాట్సాప్ లోనే చేసేయొచ్చు. వాట్సాప్ లోనే కస్టమర్లతో కనెక్షన్ పెంచుకోండి. పనుల్ని సులువుగా చేసుకోండి. అమ్మకాలు పెంచుకోండి. వాట్సాప్‌లో బిజినెస్ పెంచుకోవాలంటే ఈ 5 సూపర్ ఫీచర్ల గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

పూర్తి కథనం చదవండి

12:32 PM (IST) Mar 22

Real estate: 'రెరా' చట్టం అంటే ఏంటి.? అపార్ట్‌మెంట్ కొనే ముందు ఇది కచ్చితంగా ఎందుకు ఉండాలి.?

'పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు'. దీనిబట్టే సొంతింటికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చిన్నదో, పెద్దదో ఇల్లు నిర్మించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో అపార్ట్‌మెంట్ కల్చర్‌ భారీగా పెరుగుతోంది..
 

పూర్తి కథనం చదవండి

11:11 AM (IST) Mar 22

8 Seater Cars: 23 కి.మీ. మైలేజ్ ఇచ్చే 8 సీట్ల కార్లు ఇవే: ధర కూడా తక్కువే

8 Seater Cars: కారుల్లో పెద్ద కారంటే.. 7 సీటర్ కారే అని చాలా మంది అనుకుంటారు. కాని 8, 9 సీటర్ కార్లు కూడా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ మైలేజ్ ఇవ్వవని చాలా మంది కొనరు. ఇండియాలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే 8 సీట్ల కార్లు కూడా తక్కువగానే ఉన్నాయి. ఉన్న వాటిలో బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, తక్కువ ధరలో దొరికే 8 సీటర్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:55 AM (IST) Mar 22

Allahabad high court: మహిళ ఛాతిపై తాకితే అత్యాచారయత్నం కాదు.. ఈ మాట అన్నది మరెవరో కాదు.

దేశంలో న్యాయ వ్యవస్థకు ఎంతో గౌరవం ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు వెలవరిచే తీర్పులు చూస్తుంటే న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవం తగ్గుతుంది. తాజాగా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి.. 
 

పూర్తి కథనం చదవండి

09:54 AM (IST) Mar 22

Gold Price: బంగారం కొనేవారు కొన్ని రోజులు ఆగండి.. త్వరోలోనే రూ. 15వేలు తగ్గే అవకాశం.?

బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 90 వేలు దాటేసింది. దీంతో పసిడి పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 
 

పూర్తి కథనం చదవండి

09:03 AM (IST) Mar 22

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఉద్యోగంలో కలిసివస్తుంది.. సాలరీ పెరిగే ఛాన్స్!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.03.2025 శనివారానికి సంబంధించినవి.

పూర్తి కథనం చదవండి


More Trending News