MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • KKR vs RCB: కేకేఆర్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. దుమ్మురేపిన కోహ్లీ !

KKR vs RCB: కేకేఆర్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. దుమ్మురేపిన కోహ్లీ !

KKR vs RCB: శనివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లో కోహ్లీ అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. సూప‌ర్ బ్యాటింగ్ తో త‌న జ‌ట్టు ఆర్సీబీకి విజ‌యాన్ని అందించాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 22 2025, 11:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

IPL 2025 KKR vs RCB: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజ‌న్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో ఘ‌నంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు త‌ల‌ప‌డ్డాయి.

ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 174 ప‌రుగులు చేసింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో ఆర్సీబీ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

ఆర్సీబీ త‌ర‌ఫున సీనియ‌ర్ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులతో త‌న జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. కోహ్లీ త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 5 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఫిలిప్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు సాధించారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పాడికల్ 10 బంతుల్లో 10 పరుగులు చేశాడు. కేకేఆర్ తరఫున వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు, కేకేఆర్ తరఫున కెప్టెన్ రహానే 56 ప‌రుగులు, సునీల్ నరైన్ 44 ప‌రుగులు, అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. కృనాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. KKR త‌న త‌ర్వాతి మ్యాచ్ ను మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడ‌నుంది. ఆర్సీబీ త‌న రెండో మ్యాచ్ మార్చి 28న చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved