IPL లో అంపైర్ల జీతం: ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారు?
IPL Umpires' salary: క్రికెట్‌లో అంపైర్లు మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. క్రికెటర్లతో పాటు అంపైర్లు కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక్కో మ్యాచ్‌కు అంపైర్లు ఎంత పారితోషికం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

What is the salary of umpires in IPL: How much do they charge per match?
IPL Umpires' salary: క్రికెట్ ప్రపంచంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతూ ఆటగాళ్లు కోట్లల్లో సంపాదిస్తున్నారు. బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల ద్వారా మరింత ఆదాయాన్ని అందుకుంటారు. అయితే, మ్యాచ్‌ను సజావుగా నడిపించడంలో కీలక పాత్ర పోషించే అంపైర్ల రెమ్యునరేషన్ ఎంత? ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారు? ఐపీఎల్ లో అంపైర్లు ఎంత సాలరీ తీసుకుంటారు? ఒక్కో మ్యాచ్ కు ఎంత పారితోషికం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ల జీతం ఎంత?
అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల వేతనం దేశవాళీ క్రికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్ల జీతాన్ని నిర్ణయిస్తుంది. వారి అనుభవం, మ్యాచ్‌ల ఫార్మాట్‌పై ఆధారపడి కూడా వారు అందుకునే పారితోషికంలో మార్పులు ఉంటాయి.
What is the salary of umpires in IPL: How much do they charge per match?
టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ల విషయానికి వస్తే ఒక మ్యాచ్‌కు అంపైర్లు సుమారు ₹1,50,000 - ₹2,50,000 అందుకుంటారు. వన్డేలలో ఒక మ్యాచ్‌కు సుమారు ₹1,25,000 - ₹1,65,000 మ్యాచ్ ఫీజును తీసుకుంటారు. టీ20 క్రికెట్ లో ఒక మ్యాచ్‌కు సుమారు ₹1,25,000 - ₹1,70,000 లను మ్యాచ్ ఫీజుగా అందుకుంటారు.
అంతర్జాతీయ సిరీస్‌లు, ప్రత్యేక టోర్నమెంట్‌లు (ICC వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ) వంటి ఈవెంట్లలో అంపైర్లు అదనపు బోనస్‌లు కూడా పొందుతారు. అంతే కాకుండా, ప్రయాణ ఖర్చులు, నివాసం, భోజనం ఖర్చులు కూడా అంపైర్లకు అందిస్తారు.
Umpire, Dhoni, Virat kohli, IPL
భారత దేశవాళీ క్రికెట్ లో అంపైర్ల వేతనం ఎంత?
భారత దేశవాళీ క్రికెట్ లో అంపైర్ల వేతనం క్రికెట్ ఫార్మాట్, టోర్నమెంట్‌ను బట్టి మారుతుంది. రంజీ ట్రోఫీ ఒక్కో మ్యాచ్‌కు ₹30,000 - ₹40,000 అందుకుంటారు. అలాగే, లిస్ట్ A, దేశీయ T20 మ్యాచ్‌ల ఒక్కో మ్యాచ్‌కు ₹20,000 - ₹30,000 అందుకుంటారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే ఇది తక్కువే అయినా, దేశీయ స్థాయిలో గౌరవప్రదమైన వేతనంగా పరిగణిస్తారు.
What is the salary of umpires in IPL: How much do they charge per match?
ఐపీఎల్ (IPL) అంపైర్ల జీతం ఎంత?
అంతర్జాతీయంగా మస్తు క్రేజ్ సంపాదించిన క్రికెట్ లీగ్ లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. భారత్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ లో అంపైర్ల వేతనాలు భారీగానే ఉంటాయి.
ఎలైట్ అంపైర్లు అంటే ఎక్కువ అనుభవం కలిగిన, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న అంపైర్లు ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ కు సుమారు ₹1,98,000** సంపాదిస్తారు. అలాగే, ప్రయాణ, వసతి ఖర్చుల కోసం రోజుకు ₹12,500 భత్యంగా అందుకుంటారు.
డెవలప్‌మెంటల్ అంపైర్లు అంటే దేశీయ క్రికెట్‌లో అంపైరింగ్ చేసేవారు ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్‌కు సుమారు ₹59,000 సంపాదిస్తారు. ఇదే కాకుండా అంపైర్లకు ఒక సీజన్‌కు ₹7,33,000 వరకు స్పాన్సర్‌షిప్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. ఎలైట్ అంపైర్లకు ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసినందుకు బోనస్ లు కూడా అందుకుంటారు. అంటే స్పాన్సర్‌షిప్, ఇతర ఆదాయాలను కలుపుకున్నప్పుడు ఒక ఎలైట్ అంపైర్ సీజన్‌కు సుమారు ₹30 లక్షలు సంపాదిస్తారు.