క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్‌ ప్రారంభమైంది. ఐపీఎల్‌ 2025 స్టార్టింగ్ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగాయి...  

ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన ఐపీఎల్‌ 2025 ఆరంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ ఆట, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ మైదానంలో సందడి చేశారు. కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) సారథి రజత్‌ పాటిదార్‌లతో కాసేపు మాట్లాడారు. అనంతరం వేదికపైకి వచ్చిన షారూఖ్‌ ప్రసగించారు. 

ఐపీఎల్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని షారుఖ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇక ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన స్వరంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. హిందీ పాటలతో పాటు పుష్ప-2 సినిమాలోని ‘‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’’ తెలుగులో ఆలపించారు. ఇక బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ సైతం తన డ్యాన్స్‌తో అట్రాక్ట్‌ చేసింది. రింకుసింగ్‌, షారుఖ్‌తో కలిసి వేదికపై డ్యాన్స్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక షారుఖ్‌, కోహ్లీ సైతం స్టెప్పులేశారు. 

Scroll to load tweet…

ఇక ర్యాపర్‌ కరణ్‌ ఔజ్లా సైతం ఆడియన్స్‌ ఉర్రూతలూగించారు. తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మా తుఝే సలాం’ అంటూ దేశ భక్తి గీతాన్ని అద్భుతంగా ఆలపించారు శ్రేయా ఘోషాల్‌. అనంతరం వేదికపై ఉన్న వారంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఐపీఎల్‌ 2025 తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీలు తలపడనున్నాయి. మరి ఫస్ట్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. 

Scroll to load tweet…
Scroll to load tweet…