Mar 23, 2025, 11:45 PM IST
Telugu news live updates: IPL 2025 CSK vs MI: మెరుపును మించిన వేగం.. సెకను కంటే తక్కువ సమయంలో ధోని సూపర్ స్టంపింగ్


జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యపోరుకు సిద్ధమయ్యయాయి. ఈ విషయమై శనివారం చెన్నైలో డీఎంకే సారథ్యంలో జేఏసీ తొలి భేటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు.. బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ వివరాలు అలాగే.. ఈరోజు ఐపీఎల్‌లో భాగంగా హైరదాబాద్, రాజస్థాన్ పోటీపడనున్నాయి. వీటితోపాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
11:45 PM
IPL 2025 CSK vs MI: మెరుపును మించిన వేగం.. సెకను కంటే తక్కువ సమయంలో ధోని సూపర్ స్టంపింగ్
IPL 2025 CSK vs MI: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని మెరుపుకంటే వేగంగా స్టంపింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్ కు షాకిచ్చాడు.
9:59 PM
IPL 2025 CSK vs MI: ఐపీఎల్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
IPL 2025 CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ కెరీర్ లో చెత్త రికార్డును నమోదుచేశాడు.
పూర్తి కథనం చదవండి9:58 PM
Vi Bumper Offer: జియో పూర్తిగా ఫ్రీ.. వొడాఫోన్ ఇస్తున్న బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా..
Vi Bumper Offer: వొడాఫోన్-ఐడియా జియోను ఫ్రీగా ఇవ్వడం ఏమిటని ఆశ్యర్యపోతున్నారా? క్రికెట్ అభిమానులైన తన వినియోగదారులను ఆనందింపజేయడానికి వొడాఫోన్-ఐడియా ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లను ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలనుకునే Vi వినియోగదారులు జియో హాట్ స్టార్ ద్వారా ఫ్రీగా క్రికెట్ చూసే అవకాశాన్ని వొడాఫోన్ కల్పిస్తోంది. ఈ ఆఫర్ల విశేషాలు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
8:44 PM
Viral Video: బెంగళూరు రోడ్లపై అంతుచిక్కని నురుగు ప్రత్యక్షం.. వర్షం కురిసిన వెంటనే ఇలా ఎందుకు.?
దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత క్రమంగా పెరిగింది. మార్చి నెల ప్రారంభంలో ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అయితే మండె ఎండ నుంచి ఉపశమనం లభించేలా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా వర్షం కురిసింది. అయితే వర్షం కురిసిన అనంతరం బెంగళూరు రోడ్లపై కనిపించిన అంతుచిక్కని నురుగు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
8:43 PM
Cleanest Cities భారత్‌లో ఇవే పరిశుభ్రమైన నగరాలు.. తెలుగు నగరాలకు చోటుందా??
నగరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత నివాసయోగ్యంగా ఉంటాయి. స్వచ్ఛమైన నగరాలు జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి. 2025 నాటికి భారతదేశంలోని కొన్ని నగరాలు పరిశుభ్రమైనవిగా పేరు గాంచాయి. అందులో మధ్యప్రదేశ్ నుండి గుజరాత్ వరకు రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి8:35 PM
Ayodhya: అయోధ్య వెళ్తే ఈ 10 అద్భుతమైన ప్రదేశాలు తప్పక చూడండి
Ayodhya: శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య వెళ్తున్నారా? అయితే ముఖ్యమైన దేవాలయాలు, చూడదగ్గ ప్రదేశాలు అక్కడ చాలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. తప్పకుండా చూసి రండి.
పూర్తి కథనం చదవండి8:04 PM
Bad Breath నోరు దుర్వాసనా? ఈ రోగాల లక్షణాలేమో..!
నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కొందరికి దుర్వాసన తగ్గదు. రోజుకి రెండు మూడు సార్లు పళ్ళు తోముతున్నా అదే పరిస్థితి. దీన్ని అలక్ష్యం చేయొద్దు. ఇది ఏదైనా పెద్ద రోగం లక్షణం కావచ్చు! నోటి దుర్వాసనని నిర్లక్ష్యం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారేమో! ఐతే ఇప్పుడే జాగ్రత్త పడండి. నోటి దుర్వాసనకి కారణాలు ఏంటో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి7:20 PM
Jofra Archer: ఐపీఎల్ లో జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డు
IPL 2025, RR vs SRH: జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డును నమోదుచేశాడు. ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చాడు.
7:14 PM
Viral Video: ట్రంప్‌తో డిన్నర్.. ఎలాన్ మస్క్ చేసిన పనికి అంతా షాక్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్‌తో పాటు ఆయన స్నేహితుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇతర దేశాల అధినేతలను విమర్శించడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మస్క్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
7:10 PM
షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగారు. కాని ఆయన కెరీర్ లో షూటింగ్ కంప్లీట్ అయిపోయి.. రిలీజ్ ఆగిపోయిన సినిమా ఉందని మీకుతెలుసా? ఇంతకీ ఏంటా సినిమా?
పూర్తి కథనం చదవండి6:36 PM
IPL 2025 SRH vs RR: రాజస్థాన్ పై హైదరాబాద్ వైల్డ్ ఫైర్.. ఐపీఎల్ లో రెండో అత్యధిక టీమ్ స్కోర్
IPL 2025 SRH vs RR: హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ తన బ్యాట్ తో దుమ్మురేపాడు. తన ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీతో హైదరాబాద్ టీమ్ మరోసారి భారీ స్కోర్ సాధించింది.
6:16 PM
విజయ్ దళపతి Vs శివ కార్తికేయన్, బాక్సాఫీస్ పోరుకి సై అంటున్న స్టార్ హీరోలు
అమరన్ సినిమాతో శివకార్తికేయన్ దశ మారిపోయింది. స్టార్ హీరో స్టేటస్ తో పాటు.. వారితో బాక్సాఫీస్ పోరుకు కూడా సై అంటున్నాడు యంగ్ స్టార్. శివకార్తికేయన్ తన నెక్ట్స్ సినిమాను విజయ్ దళపతి మూవీకి పోటీగా బాక్సాఫీస్ బరిలో దించబోతున్నాడు.
పూర్తి కథనం చదవండి
6:15 PM
భారత్ కంటే పాకిస్థాన్ ప్రజలు ఎందుకు సంతోషంగా ఉన్నారు? అసలు ఇదెక్కడి లాజిక్
Happiness index: 'అంతర్జాతీయ సంతోష దినోత్సవం' సందర్భంగా, ఐక్యరాజ్యసమితి 'సంతోష సూచిక 2025' ను విడుదల చేసింది . ఈ జాబితాలో 147 దేశాలకు స్థానం లభించింది. అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం గత 8 సంవత్సరాలుగా సంతోష సూచికలో మొదటి స్థానంలో ఉంది. ఇది కాకుండా, ఈ జాబితాలో డెన్మార్క్ రెండవ స్థానంలో, ఐస్లాండ్ మూడవ స్థానంలో, తరువాత స్వీడన్ మరియు నెదర్లాండ్స్ ఐదవ స్థానంలో ఉన్నాయి.
5:24 PM
ISS: అంతరిక్ష కేంద్రంతో మనకేంటీ ఉపయోగం? ఇందుకోసం రూ. లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు.?
9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఇరుక్కుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల తిరిగి భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఐఎస్‌ఎస్ అంటే ఏంటి.? దీని ఉపయోగం ఏంటన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఐఎస్‌ఎస్‌ను ఎలా ఏర్పాటు చేశారు.? దీని ఉపయోగం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
5:10 PM
Mysterious Treasures: ప్రపంచంలో భారీ గుప్త నిధులు ఎక్కడున్నాయో తెలుసా? ఇప్పటికీ వాటి కోసం వేట సాగుతోంది
Mysterious Treasures: చరిత్ర తిరగేస్తే చాలా మంది చక్రవర్తులు, రాజులు వారి సంపదను శత్రువులకు దక్కకూడదని రహస్యంగా ఎక్కడో దాచారని తెలుస్తుంది. వారి మరణం తరువాత ఆ నిధులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండాపోయాయి. సరిగ్గా ఇదే విషయంపై ఈ రోజుకీ చాలా మంది గుప్త నిధుల కోసం వెతుకుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ గుప్త నిధుల విశేషాల గురించి తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి4:40 PM
IPL 2025 SRH vs RR: ఇదేం కొట్టుడు సామి.. ట్రావిస్ హెడ్ విధ్వంసం
IPL 2025 SRH vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు మొదలుపెట్టింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊహించిన విధంగానే బ్యాటింగ్ తో దుమ్మురేపారు. దీంతో హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
పూర్తి కథనం చదవండి
4:30 PM
Bike: ధర రూ. 70 వేలు, మైలేజ్ 73 కిలోమీటర్లు.. ఊహకందని ఫీచర్లతో బైక్
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలా మంది కోరుకునేది ఒకటే. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇవ్వాలి. ఇలాంటి బైక్స్‌కి మొగ్గు చూపుతుంటారు. అయితే అలాంటి జాబితాలోకే వస్తుంది టీవీఎస్ రేడియన్ బైక్. ఇంతకీ ఈ బైక్ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
3:33 PM
Summer Tips: వేసవిలో ఒకేసారి లీటరు నీరు తాగితే అంతే.. కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే..
Summer Tips: వేసవి కాబట్టి ఎక్కువ నీరు తాగాలని చాలా మంది అనుకుంటారు. కొందరు ఎండలో వచ్చాం కదా అని ఒకేసారి లీటరు, లీటరున్నర నీరు పట్టించేస్తారు. ఇలా తాగితే దాహం తీరడం సంగతి ఎలా ఉన్నా లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి వేసవిలో కరెక్ట్ గా ఎంత నీరు తాగాలి? ఏ విధంగా తాగితే ఆరోగ్యానికి మంచిది? ఇలాంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి3:18 PM
సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక మలుపు, సీబీఐ రిపోర్ట్ లో ఊహించని ట్విస్ట్!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యంగ్ హీరో మరణించిన 4 ఏళ్ళ తరువాత సీబీఐ ఫైనల్ రిపోర్ట్‌ను ముంబై కోర్టులో సబ్మిట్ చేసింది. ఇంతకీ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే?
పూర్తి కథనం చదవండి3:03 PM
రేఖని బలవంతంగా ముద్దుపెట్టుకున్న సీన్: షాకింగ్ నిజాలు, మధ్యలో నిర్మాత బలి
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖని, ఆమె మొదటి సినిమాలోనే ఒక నటుడు బలవంతంగా ముద్దు పెట్టుకున్న సంఘటన గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి2:50 PM
బిగ్ షాక్.. బెట్టింగ్ యాప్ కేసులో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య.. ముగ్గురూ ఇరుక్కుపోయారు
బెట్టింగ్ యాప్స్ వివాదం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలపైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏకంగా బడా హీరోలపై కేసులు నమోదయ్యాయి.
పూర్తి కథనం చదవండి1:01 PM
Kerala: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఈయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.?
మాజీ కేంద్ర సహాయ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ చంద్రశేఖర్ కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ అయితే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తోంది..
పూర్తి కథనం చదవండి11:40 AM
Mutton: మీరు కొంటున్న మటన్ మంచిదేనా.? ఎలా తెలుసుకోవాలంటే..
ఆదివారం వస్తే ఇంట్లో కచ్చితంగా మటన్ ఉండాల్సిందే. వారంలో ఒక్కసారైనా మటన్ తినే వారు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా ఇటీవల బర్డ్ ఫ్ల్యూ వార్తల నేపథ్యంలో చాలా మంది మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మటన్ ధరలు భారీగా పెరిగి పోయాయి. అయితే మనం కొనుగోలు చేస్తున్న మటన్ నిజంగానే మంచిదా.? లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
11:36 AM
ప్రభాస్, రజనీ, షారుఖ్ అందరికీ పెద్ద షాకిచ్చిన అల్లు అర్జున్.. ఆ డబ్బుతో పాన్ ఇండియా సినిమానే తీయొచ్చు
జవాన్ డైరెక్టర్ అట్లీతో రాబోయే ప్రాజెక్ట్ కోసం రూ. 175 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, అల్లు అర్జున్ ఈ ఏర్పాటుతో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా మారాడు.
పూర్తి కథనం చదవండి11:19 AM
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ.. ధర రూ.79,999 మాత్రమే
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మనదేశంలో S1 Gen 3 స్కూటర్ల డెలివరీని స్టార్ట్ చేసింది. ఈ స్కూటర్లు చాలా బ్యాటరీ ఆప్షన్లు, స్పీడ్ లిమిట్లతో దొరుకుతాయి. కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా ఉంటాయి.
పూర్తి కథనం చదవండి10:41 AM
PAN Card Update: పాన్‌కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ పనులేవీ మీరు చేయలేరు!
PAN Card Update: మీ పాన్ కార్డును అప్డేట్ చేయించారా? అంటే పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ లో మార్పులు ఉంటే తప్పులు సరిచేసి అప్డేట్ చేయించారా? చేయించకపోతే వెంటనే చేయించండి. లేకపోతే ఇక్కడ తెలిపిన ఏ పనీ మీరు చేయలేరు. అవేంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి