MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025 CSK vs MI: ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు

IPL 2025 CSK vs MI: ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు

IPL 2025 CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ జీరో ప‌రుగుల‌కే అవుట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ కెరీర్ లో చెత్త రికార్డును న‌మోదుచేశాడు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 23 2025, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Image Credit: ANI

Image Credit: ANI

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ లో చెత్త రికార్డును న‌మోదుచేశాడు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆదివారం  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ హిట్‌మ్యాన్  రోహిత్ నాలుగు బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. ముంబై మాజీ కెప్టెన్ తన ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో నిరాశ‌ప‌రిచాడు. 

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో మిడ్ వికెట్ వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ కు ఐపీఎల్ కెరీర్‌లో 18వ డకౌట్. దీంతో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ప్లేయ‌ర్ గా చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక డకౌట్ లు అయిన  గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్‌ల రికార్డులను సమం చేశాడు. 

IPL లో అత్యధికంగా డకౌట్ ప్లేయ‌ర్లు: 

18 - రోహిత్ శర్మ*
18 - గ్లెన్ మాక్స్వెల్
18 - దినేష్ కార్తీక్
16 - పియూష్ చావ్లా
16 - సునీల్ నరైన్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ రికార్డు: 

రోహిత్ శర్మ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్లేయ‌ర్, అలాగే కెప్టెన్ కూడా. రోహిత్ శర్మ  ఐపీఎల్ లో 258 మ్యాచులు ఆడాడు. 6628 ప‌రుగులు సాధించాడు. రెండు సెంచ‌రీలు, 43 హాఫ్ సెంచ‌రీలు కొట్టాడు. ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ అత్యధిక స్కోరు 109 ప‌రుగులు (నాట్ అవుట్) - 2012 సీజన్‌లో కోలకతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. 

రోహిత్ శర్మ IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిళ్లను (2013, 2015, 2017, 2019, 2020) అందించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved