MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • PAN Card Update: పాన్‌కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ పనులేవీ మీరు చేయలేరు!

PAN Card Update: పాన్‌కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ పనులేవీ మీరు చేయలేరు!

PAN Card Update: మీ పాన్ కార్డును అప్డేట్ చేయించారా? అంటే పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ లో మార్పులు ఉంటే తప్పులు సరిచేసి అప్డేట్ చేయించారా? చేయించకపోతే వెంటనే చేయించండి. లేకపోతే ఇక్కడ తెలిపిన ఏ పనీ మీరు చేయలేరు. అవేంటో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 23 2025, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. దీన్ని ఆదాయపు పన్ను శాఖ ఇస్తుంది. ఇది 10 అంకెలను కలిగిన నంబర్.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పాన్ కార్డ్ వివరాలను పర్యవేక్షిస్తుంది. ఇది గుర్తింపు ధ్రువీకరణగా పనిచేస్తుంది. బ్యాంక్ అకౌంట్ తెరవడానికి, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, బంగారం, ఆస్తులు కొనడానికి పాన్ కార్డ్ చాలా అవసరం. మీ పాన్ కార్డును అప్ డేట్ చేయకపోతే ఈ పనులేవీ మీరు చేయలేరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బ్యాంకు రిలేటెడ్ పనులకు..

బ్యాంక్ అకౌంట్ తెరవడానికి పాన్ కార్డ్ చాలా అవసరం. ఇది అప్ డేట్ అయి లేకపోతే అంటే పాన్ వివరాల్లో తేడాలు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.  సేవింగ్స్, కరెంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలన్నా కూడా అప్‌డేటెడ్ పాన్ కార్డ్ అవసరం. అంతేకాకుండా లోన్ లేదా క్రెడిట్ కార్డ్‌కు అప్లై చేసేటప్పుడు, బ్యాంక్ అప్‌డేటెడ్ పాన్ కార్డ్ అడుగుతుంది.

35

స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి...

స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి అప్డేడ్ చేసిన పాన్ కార్డు ఉండాలి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా పాన్ కార్డ్ తప్పనిసరి. ఇది పెట్టుబడి, మూలధన లాభాన్ని ట్రాక్ చేస్తుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్ లో మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. అంతేకాకుండా డెట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ కార్డు కావాలి.

45

బంగారం కొనాలన్నా అప్డేటెడ్ పాన్ కావాలి

గోల్డ్, బంగారు నగలు కొనాలంటే అప్డేట్ చేసిన పాన్ కార్డు ఇవ్వాలి. అంటే చిన్న చిన్న వస్తువులు కొంటే అవసరం లేదు కాని.. రూ.2 లక్షలకు పైగా బంగారం కొనాలంటే పాన్ కార్డ్ కావాలి. దీని వల్ల పన్ను మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేశామని చెప్పి ట్యాక్సులు ఎగ్గొడుతుంటారు. అందుకే బంగారం కొనేటప్పుడు కచ్చితంగా పాన్ కార్డు అడుగుతారు. 

ఇది కూడా చదవండి రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్

55

ఆస్తి కొనాలన్నా పాన్ కార్డు ఉండాలి

రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి కొనాలంటే పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇంటిని కొనేటప్పుడు కూడా పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆస్తి అమ్మితే అమ్మకం పత్రం(సేల్ డీడ్) లో పాన్ కార్డ్ వివరాలు పేర్కొనాలి. పాన్ వివరాలు సమర్పిస్తేనే మూలధన లాభాన్ని ట్రాక్ చేయడం సాధ్యపడుతుంది.

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ పాన్ కార్డ్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అద్దె ఒప్పందానికి కూడా పాన్ కార్డ్ అవసరం. ఇక్కడ పాన్ కార్డు వివరాలు అప్ డేట్ అయి ఉండాలి. వాటిల్లో తప్పులు, తేడాలు ఉంటే మీ పనులు రిజక్ట్ అవుతాయి.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
స్టాక్ మార్కెట్
ప్రభుత్వ పథకాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved