MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Mysterious Treasures: ప్రపంచంలో భారీ గుప్త నిధులు ఎక్కడున్నాయో తెలుసా? ఇప్పటికీ వాటి కోసం వేట సాగుతోంది

Mysterious Treasures: ప్రపంచంలో భారీ గుప్త నిధులు ఎక్కడున్నాయో తెలుసా? ఇప్పటికీ వాటి కోసం వేట సాగుతోంది

Mysterious Treasures: చరిత్ర తిరగేస్తే చాలా మంది చక్రవర్తులు, రాజులు వారి సంపదను శత్రువులకు దక్కకూడదని రహస్యంగా ఎక్కడో దాచారని తెలుస్తుంది. వారి మరణం తరువాత ఆ నిధులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియకుండాపోయాయి. సరిగ్గా ఇదే విషయంపై ఈ రోజుకీ చాలా మంది గుప్త నిధుల కోసం వెతుకుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ గుప్త నిధుల విశేషాల గురించి తెలుసుకుందాం రండి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 23 2025, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎల్ డొరాడో నిధి

ఈ నిధి కోసం వెతికి చాలా మంది చనిపోయారు. ఈ నిధి కొలంబియాలోని గ్వాటవిటా సరస్సులో ఉందని చెబుతారు. సరస్సు అడుగు భాగంలో బంగారం ఉందని నమ్ముతారు. వందల సంవత్సరాల క్రితం, చిప్చా తెగ ప్రజలు సూర్యుడిని పూజించేటప్పుడు సరస్సులో చాలా బంగారాన్ని విసిరారని ఒక మత విశ్వాసం కూడా ప్రచారంలో ఉంది. చాలా సంవత్సరాలుగా ఇలా చేయడం వల్ల సరస్సు అడుగు భాగంలో ఎక్కువ మొత్తంలో బంగారం పేరుకుపోయింది. స్పానిష్ పైరేట్ అయిన ఫ్రాన్సిస్కో పిజారో ఈ నిధిని దోచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడట. కాని అది విఫలమైంది. ఇప్పటికీ ఈ సరస్సులో బంగారం కోసం స్థానికులు వెతుకుతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంబర్ రూమ్ నిధి

అంబర్ రూమ్ అంటే.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ప్యాలెస్. అందులో 1707లో వెలకట్టలేని బంగారు నిధిని దాచారు. ఇది రష్యా, పెర్షియా మధ్య శాంతికి బహుమతిగా పీటర్ I అనే రాజుకి దక్కింది. 1941 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నిధిని వారు పూర్తిగా దక్కించుకోలేకపోయారట. 1943లో ఒక మ్యూజియంలో దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుండి అంబర్ రూమ్ వద్ద ఇంకా నిధులు దొరుకుతాయని స్థానికులు తవ్వకాలు చేస్తుంటారు. అయితే ఈ నిధికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు.

36

చంగిజ్ ఖాన్ నిధి

మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన చంగిజ్ ఖాన్ తన పాలనలో ప్రపంచాన్ని జయించాడు. అనేక రాజ్యాలను ఆక్రమించాడు. ప్రపంచంలోనే ప్రసిద్ధ యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో చంగిజ్ ఖాన్ దాదాపు మొత్తం ప్రపంచాన్ని జయించి చాలా సంపదను కూడబెట్టాడు. 1227లో చంగిజ్ ఖాన్ మరణించాడు. అతని శరీరం, సంపాదించిన నిధులను రహస్య ప్రదేశంలో ఖననం చేశారని చెబుతారు. ఆ కథలు, ఆధారాల ప్రకారం నిధి కోసం వెళ్ళిన వారు తిరిగి రాలేదని చెబుతారు. ఇప్పటికీ మంగోల్ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతుంటాయట.

46

ఫారెస్ట్ ఫెన్ నిధి

ఫారెస్ట్ ఫెన్ అనే వ్యక్తి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ (USAF)లో పనిచేశాడు. అతను పైలట్‌గా ఉండేవాడు. ఫారెస్ట్ ఫెన్ బిలియన్ డాలర్ల విలువైన కళాఖండాల వ్యాపారం కూడా చేసేవాడు. 1980లో అతను క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు అతను తన బిలియన్ డాలర్ల విలువైన నిధిని ఎక్కడో దాచిపెట్టాడు. తన నిధిని కనుగొనడానికి ప్రజలకు కొన్ని ఆధారాలు ఇచ్చాడు. వాటి ఆధారంగా నిధి కోసం ప్రయత్నించిన వారు చాలా మంది చనిపోయారు.

56

జీన్ లాఫిట్ నిధి

ఫ్రాన్స్‌కు చెందిన జీన్ లాఫిట్, అతని సోదరుడు పియర్ సముద్రపు దొంగలు. వారు మెక్సికో గల్ఫ్‌లోని వాణిజ్య నౌకలపై దాడి చేసేవారు. లాఫిట్ 1830లో మరణించాడు. అతని మరణం తరువాత వారు దోచుకున్న నిధి న్యూ ఓర్లీన్స్ తీరం చుట్టూ ఎక్కడో దాచారని చెబుతారు. దీని కోసం ఇప్పటికీ సీక్రెట్ గా వేట సాగుతూ ఉంటుంది.

66

ఓక్ ఐలాండ్ నిధి

ఓక్ ద్వీపంలో బిలియన్ల విలువైన దాచిన నిధి ఉందని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. 1975లో ఓక్ ద్వీపంలోని నోవా స్కోటియా ప్రాంతం సమీపంలో కొంతమంది పిల్లలు లైట్లను చూశారు. ఆ తరువాత, పిల్లలు అక్కడ తవ్వినప్పుడు 40 అడుగుల లోతులో 2 మిలియన్ పౌండ్లు విలువైన సంపదను గుర్తించారు. దీని తరువాత చాలా మంది నిధి కోసం వెతికారు. అమెరికా అధ్యక్షుడు కాక ముందు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ కూడా ఈ నిధి కోసం వెతికారట. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved