ఆదివారం నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్‌ను సోమవారం జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య సుమారు 1700 దాటింది. ఇక అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే ఇరాన్‌పై బాంబు దాడులు తప్పవంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

10:48 PM (IST) Mar 31
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ జట్టు కేకేఆర్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది..
10:22 PM (IST) Mar 31
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారత వ్యతిరేక దేశాలైన పాకిస్థాన్, చైనాలకు బంగ్లా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనా పర్యటన చర్చనీయాంశంగా మారింది..
09:26 PM (IST) Mar 31
వరుసగా రెండు ఓటముల తర్వాత కసితో ఉన్న ముంబై ఇండియన్స్ కేకేఆర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌పై పట్టు సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు కేకేఆర్‌ను కట్టడి చేసింది. 16.2 ఓవర్లలో 116కే కేకేఆర్‌ను పరిమితం చేసింది..
08:55 PM (IST) Mar 31
ఐపీఎల్ అంటేనే అద్భుతాలు జరిగే ప్రదేశం. అదిరిపోయే బౌలింగ్, ఆకట్టుకునే షాట్స్, ఎగ్జైట్‌మెంట్‌కి గురి చేసే ఫీల్డింగ్. ఇలా ప్రేక్షకులను అబ్బురపరిచే ఎన్నో విశేషాలు మ్యాచ్‌లు జరుగుతుంటాయి. తాజాగా సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై, కోల్‌కతాల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఇలాంటి ఓ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది..
08:14 PM (IST) Mar 31
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట బౌలింగ్ తీసుకోవడానికి గల కారణాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వివరించాడు..
07:29 PM (IST) Mar 31
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరుకు తెరలేసింది. రెండు దిగ్గజ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది..
07:04 PM (IST) Mar 31
ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇంకా బోణీ చేయలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్ ముంబై టీమ్‌కి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
06:32 PM (IST) Mar 31
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి గాను ఈ నామినేషన్ లభించింది..
06:22 PM (IST) Mar 31
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఆయన సక్సెస్ స్టోరీ ఆకట్టుకునేలా ఉంటుంది.
పూర్తి కథనం చదవండి05:19 PM (IST) Mar 31
మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ముంబై అభిమానులకు ఓ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో బుమ్రా రీఎంట్రీపై ఫ్యాన్స్‌లో ఆశలు చిగురించాయి..
పూర్తి కథనం చదవండి04:39 PM (IST) Mar 31
Government Jobs: మంచి టైపింగ్ స్కిల్ ఉంటే ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టేయొచ్చు. స్టెనోగ్రాఫర్, ఆర్వో/ఏఆర్వో, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్‌కి అప్లై చెయ్యొచ్చు. వీటిలో మంచి సాలరీ కూడా ఉంటుంది.
పూర్తి కథనం చదవండి04:25 PM (IST) Mar 31
బెట్టింగ్ యాప్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయర్స్, కొంత మంది యాంకర్స్ ప్రమోట్ చేయడం వల్లే చాలా మందికి బెట్టింగ్ యాప్స్ గురించి తెలిశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి..
03:38 PM (IST) Mar 31
మంచి ఆఫర్ ఉందనో, తక్కువ ధరకే వస్తుందని మీరు ఇ-కామర్స్ యాప్స్ లో తెగ షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు మోసపోయే అవకాశాలున్నాయి. ఎందుకో ఈ వార్త చదివితే అర్థమవుతుంది....
పూర్తి కథనం చదవండి03:22 PM (IST) Mar 31
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిలించిన విషయం తెలిసిందే. ఆకాశాన్ని అంటేలా ఉన్న పెద్ద పెద్ద భవంతులు పేక మేడళ్ల కూలిపోయాయి. భూకంపం ధాటికి వేలాది మంది మరణించారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే తరుణంలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి..
02:57 PM (IST) Mar 31
IPL 2025: రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇంతకీ అంతలా వైరల్ కావడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి
01:52 PM (IST) Mar 31
నటి త్రిషతో ఉన్న విభేదాల గురించి నయనతార బహిరంగంగా మాట్లాడిన విషయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
పూర్తి కథనం చదవండి01:35 PM (IST) Mar 31
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నాని ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గెండెపోటు కారణంతో ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది..
12:59 PM (IST) Mar 31
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దిగ్గజ టీమ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. మరి ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి.? ఎవరి బలాలు ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:00 PM (IST) Mar 31
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి గుడ్ న్యూస్. ఇకపై వీరి ప్రయాణం మరింత చౌక కానుంది... ఎందుకో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:41 AM (IST) Mar 31
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన 'వాక్సిన్ మైత్రి' కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమం వల్ల భారత్ గ్లోబల్ లెవెల్‌లో తన స్థాయిని పెంచుకుంది, బాధ్యతగల ప్రపంచ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు..
10:18 AM (IST) Mar 31
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను దర్శకుడు స్వయంగా తెలిపారు. ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు.
పూర్తి కథనం చదవండి10:15 AM (IST) Mar 31
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ మాట వినకుంటే ఇక బాంబు దాడులేనని హెచ్చరించారు.
పూర్తి కథనం చదవండి
09:48 AM (IST) Mar 31
విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డును నాలుగే రోజుల్లో బద్దలు కొట్టింది.
పూర్తి కథనం చదవండి09:45 AM (IST) Mar 31
మార్చి చివరి వారంలో ఎండలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ ఒక శుభవార్త తెలిపింది. వచ్చే మూడు రోజులు వాతావరణం చల్లబడే అవకాశం ఉందని తెలిపింది..