MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • MI vs KKR: ఆ తప్పులు రిపీట్‌ కాకపోతే.. ముంబై ఇండియన్స్‌ గెలుపు ఖాయం

MI vs KKR: ఆ తప్పులు రిపీట్‌ కాకపోతే.. ముంబై ఇండియన్స్‌ గెలుపు ఖాయం

ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఇంకా బోణీ చేయలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ ముంబై టీమ్‌కి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Published : Mar 31 2025, 07:04 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Mumbai Indians

Mumbai Indians

ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవి చూసింది. తొలి మ్యాచ్‌ చెన్నై, రెండో మ్యాచ్‌ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవి చూసింది. దీంతో అందరి దృష్టి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌పై పడింది. సీజన్‌లో తొలిసారి సొంత గ్రౌండ్‌లో ఆడుతోన్న ముంబై ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని కసితో ఉంది. అయితే ముంబై విజయం సాధించాలంటే కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

24
Image Credit: ANI

Image Credit: ANI

ముంబై ఇండియన్స్ను ఓపెనర్లు సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ.. ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రెండు సార్లు రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే అవుట్‌ అయ్యాడు. అందుకే కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఓపెనర్లు కచ్చితంగా రాణించాలి. ఇద్దరిలో ఒక్కరు స్టాండింగ్‌ ఇచ్చినా మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు. 
 

34
Asianet Image

తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బంతులు విసిరిన విఘ్నేశ్‌ రెండో మ్యాచ్‌ ఆడలేదు. మరి ఈరోజైనా తీసుకుంటారా లేదా చూడాలి. ఇక రాబిన్‌ మింజ్‌, సత్యనారాయణ రాజు ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నారు. కాబట్టి వీరి ఆటతీరు మెరుగుపడాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌ వంటి ఇద్దరు ఉత్తమ పవర్ ప్లే బౌలర్లు ఉన్నారు. రెండు మ్యాచ్‌లలో జట్టు పవర్ ప్లేలో చాలా పరుగులు ఇచ్చింది. 
 

44
Mumbai Indians

Mumbai Indians

మంచి బ్యాటింగ్‌ లైన్‌తో పటిష్టంగా ఉన్న కేకేఆర్‌ను కట్టడి చేయాలంటే పవర్‌ ప్లేలో సమర్థవంతమైన బౌలింగ్ పడాల్సి ఉంటుంది. ఇక గడిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై మిడిలార్డర్‌ బ్యాటర్లు స్ట్రైక్‌ను రొటేట్‌ చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 10 నుంచి 15 ఓవర్లలో స్ట్రైక్‌ రొటేషన్‌ చాలా ముఖ్యం. అలా అయితేనే స్కోర్‌ బోర్డు పరుగులు పెడుతుంది. కాబట్టి వీటన్నింటిలో ముంబై సక్సెస్ అయితే టీమ్‌ విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
రోహిత్ శర్మ
 
Recommended Stories
Top Stories