MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • MI vs KKR Match: మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. వాంఖడేలో జెండా పాతేది ఎవరు.?

MI vs KKR Match: మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. వాంఖడేలో జెండా పాతేది ఎవరు.?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దిగ్గజ టీమ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ జరగనుంది. ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి. మరి ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి.? ఎవరి బలాలు ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Published : Mar 31 2025, 12:59 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
MI vs KKR Match

MI vs KKR Match

ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో తొలిసారి సొంత మైదానంలో ఆడబోతోంది. ముంబై, కోల్‌కతాల మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దీంతో వాంఖడే స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌పై అందరి దృష్టిపడింది. 

25
Mumbai Indians

Mumbai Indians

విజయ పరంపర కొనసాగించాలని కోల్‌కతా: 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయపరంపరను కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యింది. సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైన కోల్‌కతా.. రాజస్థాన్‌ రాయల్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. కాగా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై మరోసారి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. 
 

35
KKR

KKR

విజయ పరంపర కొనసాగించాలని కోల్‌కతా: 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయపరంపరను కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యింది. సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైన కోల్‌కతా.. రాజస్థాన్‌ రాయల్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. కాగా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై మరోసారి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. 
 

45
Asianet Image

ముంబై వర్సెస్‌ కోల్‌కతా మధ్య గణంకాలు ఎలా ఉన్నాయి.? 

ఐపీఎల్ చరిత్రలో ముంబై, కోల్‌కతాల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ముంబైదే ఆదధిపత్యం ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 23 మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 

ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు గెలవొచ్చు.? 

రెండు జట్లు సమాన బలాలతో ఉంది. దీంతో రెండు జట్లలో విజయం ఎవరిది అనే విషయం చెప్పడం అంత సులభం కాదు. అయితే ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విజయాన్ని అందుకోకపోవడం, ట్రాక్‌ రికార్డ్‌ పరంగా చూసినా కోల్‌కతాపై ముంబైదే పైచేయి ఉండడంతో ముంబైకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. వాంఖడే పిచ్ కూడా ముంబై టీమ్‌కి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. 
 

55
Asianet Image

ఇరు జట్ల ప్లేయర్స్‌:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
 
Recommended Stories
Top Stories