రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

By pratap reddyFirst Published Oct 24, 2018, 1:16 PM IST
Highlights

తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన నాగేశ్వర రావు ఒడిశా ఐపిఎస్ క్యాడర్ కు చెందినవారు. వృత్తిలో అత్యంత కఠినంగా వ్యవహరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 

న్యూఢిల్లీ: చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో మన్నం నాగేశ్వర రావు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాత్రికి రాత్రి వెలువడిన ఉత్తర్వులతో ఆయన ఆ బాధ్యతలు చేపట్టి సిబిఐ కేంద్ర కార్యాలయంలో సోదాలకు పూనుకున్నారు.

తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన నాగేశ్వర రావు ఒడిశా ఐపిఎస్ క్యాడర్ కు చెందినవారు. వృత్తిలో అత్యంత కఠినంగా వ్యవహరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పిజీ చేసిన ఆయన మద్రాసు ఐఐటిలో పరిశోధన చేశారు. ఆ తర్వాత ఐపిఎస్ అధికారిగా ఎంపికయ్యారు. స్థానికంగా బొగ్గు అక్రమ రవాణాకు పేరు మోసిన ఒడిశాలోని తాల్చేరులో ఆయన తొలి పోస్టింగ్ అయింది. ఆ పదవిలో ఆయన వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. 

మణిపూర్ తిరుగుబాట్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ లో నిర్వహించిన పాత్ర కూడా ప్రశంసలు అందుకుంది. అత్యాచారం కేసును పరిష్కరించడానికి ఒడిశాలో డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ ను వాడిన తొలి అధికారి నాగేశ్వర రావు కావడం విశేషం. ఒరిస్సా రైల్వే అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ గా కూడా ఆయన పనిచేశారు. 

సంబంధిత వార్తలు

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

click me!