వీజీ సిద్దార్ధ మృతి:కేఫ్ కాఫీ డే బోర్డు మీటింగ్

By narsimha lodeFirst Published Jul 31, 2019, 10:50 AM IST
Highlights

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు సిద్దార్ధ అంత్యక్రియలను బెలూరులోనిఎస్టేట్ లో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.


బెంగుళూరు:కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ మృతదేహం బుధవారంనాడు నేత్రావతి నదిలో లభ్యం కావడంతో  ఇవాళ ఉదయం 11 గంటలకు కేఫ్ కాఫీ డే బోర్డు మీటింగ్ 11 గంటలకు నిర్వహించనున్నారు.

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వీజీ సిద్దార్ధ ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ పరిణామాల నేపథ్యంలో  సీసీడీ బోర్డు మీటింగ్  బుధవారం నాడు ఉదయం 11 గంటలకు చిక్‌మంగళూరులో  సమావేశం కానుంది. వీజీ సిద్దార్ధ మృతిపై బోర్డు సమావేశమై సంతాపం తెలపనుంది.

సిద్దార్ధకు భార్య మాళవిక, ఇద్దరు పిల్లలున్నారు. సిద్దార్ధ కొడుకు ఒకరు సీసీడీ బోర్డు సభ్యుడిగా కూడ ఉన్నారు. ఈ సమావేశానికి  వీజీ సిద్దార్ద కుటుంబసభ్యులు వస్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు.పోస్టుమార్టం తర్వాత వీజీ సిద్దార్ధ మృతదేహన్ని చిక్‌మంగుళూరుకు తరలించే అవకాశం ఉందని  రిపోర్టులు చెబుతున్నాయి. 

వీజీ సిద్దార్ద అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయమై  కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. కుటుంబసభ్యుల  నిర్ణయం మేరకు  వీజీ సిద్దార్ధ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టుగా  ఎమ్మెల్యే రాజేంద్రగౌడ తెలిపారు.బెలూరు తాలూకాలోని తన తండ్రి ఏస్టేట్ లో వీజి సిద్దార్ధ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టుగా రాజేంద్రగౌడ తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

విషాదాంతం: నేత్రావతిలో శవమై తేలిన కాఫీ డే అధినేత సిద్ధార్ధ్

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

click me!