ప్రభుత్వ ఏజెన్సీల వేధింపులు ఎలా ఉంటాయో తెలిశాయా: సిద్ధార్ధ ఆత్మహత్యపై మాల్యా

By Siva KodatiFirst Published Jul 31, 2019, 10:22 AM IST
Highlights

ప్రభుత్వ యంత్రాంగం వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో సిద్ధార్ధ ఉదంతమే నిదర్శనమని మాల్యా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నైరాశ్యంలోకి నెట్టగలవని.. బకాయిలన్నీ చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ, తన విషయంలో ఆయా సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసిందేనంటూ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు.

కేఫ్ కాఫీ డే యజమాని, వ్యాపారవేత్త వి. జి. సిద్ధార్ధ ఆత్మహత్యపై ఆర్ధిక నేరస్తుడు విజయ్ మాల్యా కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్ధ మంచి వ్యక్తని.. తెలివైన వ్యాపారవేత్తని.. ఆయనతో తనకు పరోక్ష సంబంధాలు ఉన్నాయని మాల్యా తెలిపారు.

ఆయన రాసిన లేఖలోని అంశాలను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో సిద్ధార్ధ ఉదంతమే నిదర్శనమని మాల్యా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నైరాశ్యంలోకి నెట్టగలవని.. బకాయిలన్నీ చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ, తన విషయంలో ఆయా సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసిందేనంటూ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు.

పాశ్చాత్య దేశాల్లో అయితే.. అప్పులను తిరిగి చెల్లించేందుకు సహాయం చేస్తారు.. కానీ నా విషయంలో మాత్రం ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను అడ్డుకుంటున్నారంటూ మాల్యా వాపోయారు. బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల అప్పులు ఎగవేసిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్య ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. 

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

click me!