ముగిసిన జైట్లీ అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

Siva Kodati |  
Published : Aug 25, 2019, 02:17 PM ISTUpdated : Aug 25, 2019, 07:34 PM IST
ముగిసిన జైట్లీ అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

సారాంశం

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున వున్న నిగమ్ బోధ్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. 

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున వున్న నిగమ్ బోధ్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

జైట్లీ చితికి కుమారుడు రోహన్ నిప్పంటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పలువురు ముఖ్యమంత్రులు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై అరుణ్ జైట్లీకి తుది వీడ్కోలు పలికారు. 

అంతకు ముందు జైట్లీ భౌతికకాయాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా నిగమ్ బోధ్‌కు తరలించారు. దారి పొడవునా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అరుణ్ జైట్లీ భౌతికకాయానికి నివాళుర్పించారు. ఆయన అంతిమయాత్రకు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

ఉదయం స్వగృహం నుంచి ఆయన భౌతికకాయాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ప్రజలు, నేతల సందర్శనార్ధం మధ్యాహ్నం వరకు అక్కడే వుంచారు.

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌ చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. న్యాయకోవిదుడిగా, పార్లమెంటెరీయన్‌గా జైట్లీ దేశప్రజలతో మన్ననలు అందుకున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే సుష్మా స్వరాజ్, జైట్లీ వంటి అగ్రనేతలను కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

బీజేపీ కేంద్ర కార్యాలయానికి జైట్లీ పార్థీవదేహం, మధ్యాహ్నం అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

జైట్లీ భార్యాకొడుకులతో మాట్లాడిన మోడీ: మిస్సవుతున్నా...

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

మోడీకి ఢిల్లీ గేట్స్ తెరిచింది జైట్లీనే

జైట్లీ మృతిపై కపిల్ సిబల్ దిగ్భ్రాంతి : క్రికెట్ లో మేమిద్దరం అంటూ ఫోటోలు విడుదల

PREV
click me!

Recommended Stories

Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu