గాలి అరెస్ట్.. మరో ముగ్గురి కోసం గాలింపు

By ramya neerukondaFirst Published Nov 12, 2018, 3:53 PM IST
Highlights


అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కంపెనీ చీఫ్ సయ్యద్ అహ్మద్ ఫరీద్‌కు, గాలి జనార్ధన్ రెడ్డికి మధ్య సయోధ్య కుదిర్చిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. 

ఆ ఇద్దరితో పాటు గాలి జనార్ధన్ రెడ్డికి 57కిలోల బంగారాన్ని అక్రమంగా చేరవేసిన మరో వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నారు. బళ్లారిలో ఉన్న రాజమహల్ ఫ్యాన్సీ జ్యువెలర్స్ యజమాని రమేష్ కొఠారీ నుంచి బంగారాన్ని తరలించినట్లు తెలిసింది. ఈ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డికి నవంబర్ 24వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

గాలి తరపు న్యాయవాది కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ.. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మృతితో కోర్టుకు సెలవు ప్రకటించారు. దీంతో మంగళవారం గాలి బెయిల్ పిటిషన్ విచారణకొచ్చే అవకాశముంది.

read more news

పోంజి స్కామ్‌లో గాలి అరెస్ట్.. రూ.18 కోట్లు లంచం తీసుకున్నందుకు..

పోలీసులకు లొంగిపోనున్న గాలి..?

హైదరాబాదులోని ఫ్రెండ్ ఇంట్లో గాలి: తృటిలో గాయబ్

ఇంట్లో సోదాలు: అధికారులతో గొడవకు దిగిన గాలి అత్త

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

కాంగ్రెస్ 14 ఏళ్ల నిరీక్షణ... ‘‘గాలి’’ కోటలో హస్తం పాగా

గాలి వివాదం: ఏపీ, కర్నాటకలకు సుప్రీం వార్నింగ్

click me!