హైపవర్ కమిటీ ఎఫెక్ట్: అలోక్ వర్మ సంచలన నిర్ణయం

By narsimha lodeFirst Published Jan 11, 2019, 3:45 PM IST
Highlights

సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతల నుండి అలోక్ వర్మ‌ను తప్పించి ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడంతో ఐపీఎస్ సర్వీసుల నుండే అలోక్ వర్మ తప్పుకొన్నారు. ఈ మేరకుశుక్రవారం నాడు ఐపీఎస్ సర్వీసులకు ఆయన గుడ్‌బై చెప్పారు. 


న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతల నుండి అలోక్ వర్మ‌ను తప్పించి ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడంతో ఐపీఎస్ సర్వీసుల నుండే అలోక్ వర్మ తప్పుకొన్నారు. ఈ మేరకుశుక్రవారం నాడు ఐపీఎస్ సర్వీసులకు ఆయన గుడ్‌బై చెప్పారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం నాడు అలోక్ వర్మ బాధ్యతలను స్వీకరించారు.  ఈ బాద్యతలు స్వీకరించిన తర్వాత  వర్మ ఐదుగురు ఉన్నతాధికారులను గురువారం నాడు బదిలీ చేశారు. వారి స్థానంలో పాత టీమ్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

గురువారం సాయంత్రం కీలకమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. మోడీ అధ్యక్షతన సమావేశమైన హై పవర్ కమిటీ  అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న  లోక్‌సభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మాత్రం వర్మను తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

జస్టిస్ సిక్రీ మాత్రం  వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని పట్టుబట్టారు. మోడీ కూడ వర్మను తప్పించేందుకే మొగ్గు చూపారు. దీంతో వర్మను ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేశారు.

హై పవర్ కమిటీ నిర్ణయం కారణంగా  వర్మ   సీబీఐ డైరెక్టర్ పదవికి శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఆయనను విధుల నుండి తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్ రావు రిలీవ్ చేశారు. మరో వైపు ఫైర్ సర్వీసెస్ లో వర్మ చేరేందుకు సుముఖత చూపలేదు.

ఐపీఎస్ సర్వీసెస్ నుండి కూడ వర్మ తప్పుకొన్నారు. వాస్తవానికి అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్‌గా  ఈ నెల 30వ తేదీ వరకు పదవీ కాలం ఉంది.కానీ, ఈ లోపుగానే ఆయనను ఈ పదవి నుండి తప్పించారు.

మరో వైపు వర్మ నిన్న చేసిన బదిలీలను రద్దు చేస్తూ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

ఢిల్లీ హైకోర్టులో రాకేష్ ఆస్థానాకు చుక్కెదురు

ఒక్కరి ఆరోపణతోనే నాపై బదిలీ వేటు, సీబీఐని కాపాడండి: అలోక్ వర్మ

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ‌ను తొలగించిన హైపవర్ కమిటీ

అలోక్‌వర్మ దెబ్బ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారుల బదిలీ

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

 

click me!