రాయలసీమ ప్రజలు ఇప్పటికీ రాయల తెలంగాణ కోరుకుంటున్నారు: కేటీఆర్ తో వైసీపీ ఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published Sep 17, 2019, 3:32 PM IST
Highlights

రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే రాయసీమలో కాస్త మార్పు వచ్చి ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల రాయల తెలంగాణ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ రాయలసీమ ప్రజలకు తెలంగాణలో కలవాలనే ఉందన్నారు. 
 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.  కేటీఆర్ తో భేటీ అయ్యేందుకు ఆయన మంగళవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కోడెల ఆత్మహత్యకు ఆయన నమ్ముకున్న తెలుగుదేశం పార్టీయే కారణమని ఆరోపించారు. 

గత కొద్ది రోజులుగా కోడెలను చంద్రబాబు సమావేశాలకు పిలవడంలేదని, కోడెలకు కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కోడెలపై ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. 

కోడెల బాధితులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఫిర్యాదులు చేశారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సుమోటోగా తీసుకుని కోడెలపై కేసులు పెట్టి ఉంటే వైసీపీని నిందించాలే తప్ప తమపై అకారణంగా నిందలు వేయోద్దని హితవు పలికారు. 

తాము ఎవరిపై తప్పుడు కేసులు పెట్టలేదని, అలాగని ఎవరినీ వేధించనూ లేదన్నారు. ఎవరైనా తప్పుచేస్తే మాత్రం వదిలిపెట్టబోమని కూడా తెగేసి చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్‌ను కాపీకొడుతున్నారని అనడం సరికాదన్నారు. జగన్ తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో పాలన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే రాయసీమలో కాస్త మార్పు వచ్చి ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల రాయల తెలంగాణ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ రాయలసీమ ప్రజలకు తెలంగాణలో కలవాలనే ఉందన్నారు. 

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోయాక కూడా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!