1977, 1980 సీజన్లలో భారత ప్లేయర్లు ఎవ్వరూ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలవలేకపోయారు. అయితే 1983లో భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే, కాంస్య పతకం సాధించి... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర లిఖించాడు...
అయితే ఆ తర్వాత 30 ఏళ్ల వరకూ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ప్లేయర్లు ఎవ్వరూ పతకాలు గెలవలేకపోయారు. గాయం కారణంగా బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకున్న పీవీ సింధు మాత్రమే ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత ప్లేయర్‌గా ఉంది...
పీవీ సింధు తప్పుకున్నా భారత్ నుంచి వుమెన్స్ సింగిల్స్‌లో మాళవిక బంసోద్, సైనా నెహ్వాల్ పోటీపడబోతున్నారు. 20 ఏళ్ల మాళవిక, గత ఏడాది ఉగాండా ఇంటర్నేషనల్, లిథునియాన్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలిచింది...
lakshya sena
వుమెన్స్ సింగిల్స్‌తో పోలిస్తే మెన్స్ సింగిల్స్‌లో భారత్‌పై భారీ ఆశలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన లక్ష్యసేన్‌తో పాటు టాప్ షెట్లర్ శ్రీకాంత్ కిడాంబి, సాయి ప్రణీత్, హెచ్ ఎస్ ప్రణయ్... మెన్స్ సింగిల్స్‌లో పోటీపడబోతున్నారు...
badminton
వీరిలో లక్ష్యసేన్, ప్రణయ్, శ్రీకాంత్‌లపై భారీ ఆశలే పెట్టుకుంది భారత జట్టు.. అలాగే మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి 7 సీడ్ జోడీగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో దిగబోతున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఈ జోడీ, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఇదే జోరు చూపించాలని ఆశపడుతున్నారు...
వుమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి, పూజా దండు-సంజన సంతోష్, త్రీష జోల్లీ-గాయత్రి గోపిచంద్, అశ్విని భట్-శిఖా గౌతమ్... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు తరుపున బరిలో దిగబోతున్నారు... గాయత్రి గోపిచంద్, భారత లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూతురు...
వీరితో పాటు మను అట్రీ- బీ సుమీత్ రెడ్డి, అర్జున్ రామచంద్రన్ - ద్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ గరగ, విశ్వనాథ్ గౌడ్ పంజాల... మెన్స్ డబుల్స్‌లో పోటీలో నిలిచారు.
వుమెన్స్ డబుల్స్‌లో 2011లో అశ్విని పొన్నప్ప- జ్వాలా గుప్తా జోడి కాంస్యం గెలిస్తే, మెన్స్ డబుల్స్‌లో, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ ఇప్పటిదాకా పతకం గెలిచింది లేదు. దీంతో ఈసారి భారీ ఆశలే ఉన్నాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్‌సాగర్- తనీశా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవగన్... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడుతున్నారు.