రూ. 5.5 లక్షలకే 30 కి.మీ మైలేజ్ ఇచ్చే కొత్త ఆల్టో కారు వచ్చేస్తోంది

First Published | Nov 24, 2024, 1:32 PM IST

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేవరేట్ కారు మారుతి సుజుకి ఆల్టో కొత్త మోడల్ మార్కెట్ లోకి రావడానికి సిద్ధమవుతోంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్ కార్లలో ఆల్టో కారు కూడా ఒకటి. మారుతి సుజుకి తన ఆల్టో కొత్త వెర్షన్ ను చాలా తక్కువ ధరకు త్వరలో విడుదల చేయనుంది. ఈ కారు గురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి. 

మారుతి సుజుకి ఆల్టో కార్లకు జపాన్, ఇండియా మార్కెట్లలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ దేశాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇప్పటి వరకు 9 వెర్షన్స్ రిలీజ్ అయ్యాయి. లాస్ట్ మోడల్ ను 2021లో విడుదల చేశారు. ఇప్పుడు 10 వ వెర్షన్ ను పోటీ కంపెనీలకు దీటుగా రెడీ చేశారు. కొత్త ఆల్టో ఎంత మైలేజ్ ఇస్తుంది. ఎప్పుడు ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సుజుకి ఆల్టో కారుకు దశాబ్దాల చరిత్ర ఉంది. దీని మొదటి మోడల్ మార్కెట్ లోకి వచ్చి సుమారు నాలుగున్నర దశాబ్దాలు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్టో కార్లను అప్ డేట్ చేస్తూ విడుదల చేస్తున్నారు. గొప్ప విషయం ఏమిటంటే ప్రతి మోడల్ వినియోగదారులకు ఎంతో నచ్చుతున్నాయి. ఆల్టో  కారు ధర కూడా బడ్జెట్ లో ఉండటం ప్రజలకు కలిసి వచ్చే అంశం. 

సుజుకి ఆల్టో కారుకు మొట్ట మొదట 1979లో జపాన్‌లో విడుదలైంది. 2000లో భారతదేశంలో విడుదలైంది. కంపెనీ ఇప్పుడు దాని కొత్త తరం మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. 2024 ప్రారంభంలో సుజుకి 10వ తరం ఆల్టోను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రస్తుత వెర్షన్ కంటే చాలా తక్కువ బరువు ఉంటుంది.

Latest Videos


కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఆల్టో పాత మోడల్ కంటే 100 కిలోల తక్కువ బరువు ఉంటుంది. ఇది సుమారు 580 కిలోల నుండి 660 కిలోల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూడవ తరం ఆల్టో కూడా 580 కిలోల బరువు ఉండేది. 

కొత్త ఆల్టో కారులో అల్ట్రా హై టెన్సైల్ స్టీల్ తో తయారు చేసిన తేలికపాటి హార్టెక్ట్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగిస్తున్నారు. ఈ మెటీరియల్ తేలికగా, చాలా బలంగా ఉంటుంది.

ప్రస్తుత మోడల్ కంటే కొత్త ఆల్టో మెరుగైన మైలేజ్‌ను అందిస్తుందని సమాచారం. ప్రస్తుత ఆల్టో కారు పెట్రోల్ వేరియంట్‌ అయితే 25.2 కి.మీ/లీ, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌ అయితే 27.7 కి.మీ/లీ మైలేజ్ ఇస్తోంది. రానున్న కొత్త మోడల్ దీనికి మించి మైలేజ్ ఇస్తుందని సమాచారం. 

10వ తరం ఆల్టో కారులో 2 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 49 PS నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమరుస్తున్నారు. అదనంగా మోటారు అవుట్‌పుట్‌ను పెంచడానికి లీన్ బ్యాటరీ సిస్టమ్‌ను కూడా అటాచ్ చేస్తారు. వీటన్నిటినీ బట్టి కొత్త ఆల్టో 30 కి.మీ/లీ మైలేజ్‌ను అందిస్తుందని అంచనా.

ప్రస్తుత సుజుకి ఆల్టో పెట్రోల్ వేరియంట్ ధర 10,68,000 యెన్ లు. అంటే ఇండియాలో రూ. 5.83 లక్షలు. మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ ధర 12,18,800 యెన్ లు. అంటే రూ. 6.65 లక్షలకు ఇండియా మార్కెట్ లో దొరుకుతుంది. ఇక త్వరలో విడుదల కానున్న ఆల్టో కొత్త వెర్షన్ ప్రారంభ ధర సుమారు గా రూ. 5.46 లక్షలు ఉంటుందని అంచనా.

click me!