టాలీవుడ్ కమెడియన్ కి కోటి రెమ్యునరేషన్.. సత్య అంత క్రేజ్ లేదు, అయినా ఎలా జాక్ పాట్ కొట్టాడంటే..

First Published | Nov 24, 2024, 1:15 PM IST

సత్య కాకుండా మరో కమెడియన్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ తో అందరి షాక్ కి గురి చేస్తున్నాడు. అతడు బాగా స్టార్ ఇమేజ్ ఉన్న కమెడియన్ కాదు.. అలాగని అప్ కమింగ్ కమెడియన్ కూడా కాదు.మంచి గుర్తింపే ఉంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ కమెడియన్ ఎవరంటే వెంటనే సత్య అని చెబుతారు. కొంత కాలంగా సత్య తన కామెడీతో చేస్తున్న ఇంపాక్ట్ అది. చివరగా మత్తు వదలరా 2 చిత్రంలో సత్య పెర్ఫామెన్స్ కి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయింది. రియా ఎవరు.. దామిని డాటర్ అనే డైలాగ్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సత్య ఇప్పుడు తనకున్న క్రేజ్ తో పారితోషికం ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. సత్య రెమ్యునరేషన్ పెంచితే అందులో పెద్దగా ఆశ్చర్యం ఏమి ఉండదు. 

కానీ సత్య కాకుండా మరో కమెడియన్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ తో అందరి షాక్ కి గురి చేస్తున్నాడు. అతడు బాగా స్టార్ ఇమేజ్ ఉన్న కమెడియన్ కాదు.. అలాగని అప్ కమింగ్ కమెడియన్ కూడా కాదు.మంచి గుర్తింపే ఉంది. ఆ కమెడియన్ ఎవరో కాదు వైవా హర్ష. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినా వైవా హర్ష టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. 


వైవా హర్ష తన లేటెస్ట్ మూవీ కి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వైవా హర్ష ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సారంగపాణి జాతకం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియదర్శి కూడా మరో పాత్రలో ఛాన్స్ దక్కించుకున్నాడు. చాలా కాలం నుంచి టాలీవుడ్ లో కమెడియన్లు డైలీ కాల్ షీట్స్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోలు, హీరోయిన్ల లాగా కమెడియన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు సింగిల్ పేమెంట్ ఉండదు. 

రోజుకి ఇంత అని రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటారు. హీరోలు, హీరోయిన్లు సినిమా మొత్తం ఉండాలి కాబట్టి బల్క్ అమౌంట్ లో సింగిల్ పేమెంట్ మాట్లాడుకుంటారు. ఒక వేళ కమెడియన్ డేట్లు కూడా ఎక్కువ అవసరం అయితే అలాంటప్పుడు ఖర్చుకు తగ్గించుకోవడం కోసం దర్శక నిర్మాతలు సింగిల్ పేమెంట్ మాట్లాడి ఒప్పిస్తారు. కానీ డైలీ రెమ్యునరేషన్ అయితేనే కమెడియన్లకు ఎక్కువ ఆదాయం ఉంటుంది. 

సాధారణంగా కమెడియన్ క్రేజ్ ని బట్టి రోజుకి 30వేల నుంచి 3 లక్షల వరకు పారితోషికం ఉంటుంది. సారంగపాణి జాతకం చిత్రంలో వైవా హర్ష సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారట. దాదాపు 80 రోజుల డేట్లు అవసరం అయ్యాయట. ఈ లెక్కన వైవా హర్ష రెమ్యునరేషన్ కోటి దాటిపోయినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు వైవా హర్ష నిర్మాతలతో డైలీ పేమెంట్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ లెక్కన అతడి రెమ్యునరేషన్ కోటి రూపాయలు దాటిపోయిందట. దీనితో వైవా హర్ష జాక్ పాట్ కొట్టాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. 

Latest Videos

click me!