సౌతాఫ్రికా టీ20 టూర్, బోర్డర్ గవాస్కర్ ట్రోపీలకు యువ ఆటగాళ్లు దూరం ... టీమిండియా జట్టిదే...

By Arun Kumar P  |  First Published Oct 25, 2024, 10:30 PM IST

కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోపీతో పాటు సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ కోసం భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. ఈ సీరీస్ లకు యువ ఆటగాళ్లు దూరమయ్యారు. 


సౌతాఫ్రికా టూర్ తో పాటు ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ కోసం టీమిండియా జట్టును ఎంపికచేసారు. ఈ మేరకు బిసిసిఐ ఆటగాళ్ల లిస్ట్ ను ప్రకటించింది. సౌతాఫ్రికా టీ20 సీరిస్ కు సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

సౌతాఫ్రికా టీ20 సీరిస్ కోసం టీమిండియా జాబితా :

Latest Videos

undefined

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్దీక్ పాండ్య,  అక్షర్ పటేల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశక్, ఆవేష్ ఖాన్, యశ్ దయాల్

బోర్డర్ గవాస్కర్ ట్రోపీ కోసం టీమిండియా జట్టు : 

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ సింగ్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురేల్, రవీంద్ర జడేజ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రానా, నితిష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్  

టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు : 

సౌతాఫ్రికాతో వచ్చేనెల నవంబర్ లో 4 టీ20 ల సీరిస్ జరగనుంది.నవంబర్ 8 న డర్బన్ లో మొదటి టీ20 జరగనుంది. అయితే ఈ టీ20 కు గాయాల కారణంగా యువ ఆటగాళ్లు మయాంక్ యాదవ్, శివమ్ ధూబే దూరమయ్యారు. రియాన్ పరాగ్ కు కూడా జట్టులో చోటు దక్కలేదు. 

ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీ నవంబర్ 22న ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల ఈ సీరిస్ కు కీలక బౌలర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ సీరిస్ జరగనుంది. 


 

click me!