12 వారాలకు అన్ని లక్షలా! మైండ్ బ్లాక్ చేసేలా యష్మి రెమ్యూనరేషన్, ఏడాది సంపాదన మూడు నెలల్లో!

First Published | Nov 24, 2024, 12:57 PM IST

పన్నెండు వారాలు హౌస్స్లో ఉన్న యష్మి భారీగా సంపాదించినట్లు తెలుస్తుంది. ఆమెకు రెమ్యూనరేషన్ రూపంలో పెద్ద మొత్తంలో ముట్టిందట. మరి బిగ్ బాస్ షోతో యష్మి ఎన్ని లక్షలు ఆర్జించారో చూద్దాం.. 
 

Bigg boss telugu 8

బిగ్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ఐదుగురు ఎలిమినేట్ అవుతారు. 12వ వారం ఐదుగురు నామినేట్ అయ్యారు. యష్మి, పృథ్వి, నిఖిల్, ప్రేరణ, నబీల్ నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. 
 

Bigg boss telugu 8

శనివారం నిఖిల్ సేవ్ అయ్యాడు. అనంతరం ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. డేంజర్ జోన్లో పృథ్వి, యష్మి మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు నాగార్జున వెల్లడించారు. ఉత్కంఠ మధ్య యష్మి ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున ప్రకటించినట్లు సమాచారం. యష్మి ఎలిమినేషన్ లాంఛనమే అని తెలుస్తుంది. సాయంత్రం ఎపిసోడ్ తో దీనిపై అధికారికంగా స్పష్టత వస్తుంది. 


Bigg boss telugu 8

యష్మి ఎలిమినేషన్ ఊహించని పరిణామం. ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ లలో గట్టి పోటీ ఇస్తుంది. ఎంటర్టైనర్ కూడాను. అయితే నిఖిల్ ఆమె గేమ్ ని దెబ్బ తీశాడనే వాదన ఉంది. గౌతమ్ కి కూడా ఇందులో పాత్ర ఉంది అంటారు. నిఖిల్, గౌతమ్ ఇద్దరూ యష్మికి ఆకర్షితులు అయ్యారు. యష్మి మాత్రం నిఖిల్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. దాంతో గౌతమ్ డ్రాప్ అయ్యాడు. 

ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన యష్మి తండ్రి ఈ విషయంలో హెచ్చరించాడు. నిఖిల్ తో నీ రిలేషన్ తప్పుగా వెళుతుందని చెప్పాడు. గ్రూప్ గేమ్ వదిలేసి నీ కోసం నువ్వు ఆడు అన్నాడు. అయితే అప్పటికే యష్మి కి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో సోషల్ మీడియాలో యష్మి ఎలిమినేషన్ పై చర్చ జరుగుతుంది. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అనే వాదన తెరపైకి వచ్చింది. అసలు పృథ్వి కంటే యష్మి కి ఓట్లు ఎలా తక్కువ వస్తాయని అంటున్నారు. 

Bigg boss telugu 8

కారణం ఏదైనా కానీ.. యష్మి ఇంటి బాట పట్టింది. టాప్ 5 లో ఉంటుంది అనుకుంటే 12వ వారమే ఆమె జర్నీ ముగిసింది. కాగా యష్మి రెమ్యూనరేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె భారీగా ఆర్జించారని అంటున్నారు. సీరియల్ నటి అయిన యష్మి.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నెగిటివ్ రోల్ చేసింది. అదే సీరియల్ లో ప్రేరణ హీరోయిన్ గా చేయడం విశేషం. 

సదరు సీరియల్ కి యష్మి రోజుకు రూ. 15 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. నెలలో ఒక పది రోజులకు పైగా ఆమెకు వర్క్ ఉండే సూచనలు కలవు. కాగా బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె వారానికి రూ. 2 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన 12 వారాలకు యష్మి  రూ. 24 లక్షలు ఆర్జించింది. అంటే సీరియల్ ద్వారా ఓ ఏడాదికి సంపాదించే మొత్తం బిగ్ బాస్ షోతో ఆమె సంపాదించారని అంటున్నారు. 

Latest Videos

click me!