ఎన్టీఆర్‌ బాగా ఇష్టపడ్డ పాత్ర ఏంటో తెలుసా? ఎస్వీఆర్‌పై జెలసీతో మళ్లీ చేయాలనుకున్నా, ఆ కోరిక తీరకుండానే

First Published | Nov 24, 2024, 1:08 PM IST

ఎన్టీ రామరావు తన కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు చేశారు. కోరుకున్న పాత్రలు పోషించారు. కానీ ఒక్క పాత్ర మాత్రం తీరని కోరికగానే మిగిలిపోయింది. 
 

ఎన్టీ రామారావు తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు వేశారు. తాను పోషించని పాత్ర అంటూ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడు, అర్జునుడు ఇలా దాదాపు హీరోయిజం, విలనిజం ఉన్న పౌరాణిక పాత్రలు కూడా పోషించారు. అనేక జానపద పాత్రలు సైతం పోషించారు. వెండితెరని రక్తికట్టించారు. అయితే ఎన్టీఆర్‌కి తీరని కోరిక ఒకటి మాత్రం అలానే ఉండిపోయింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో బాగా ఇష్టపడ్డ పాత్ర, తాను బాగా కోరుకున్న పాత్ర, నటుడిగా విజృంభించేందుకు స్కోప్‌ ఉన్న పాత్రని చేయాలనుకున్నారు. ఆ సినిమా కూడా ప్లాన్ చేశారు. దర్శకుడిని కూడా మాట్లాడారు. కానీ స్క్రిప్ట్ సిద్ధం కాలేదు, ఈ లోపు రాజకీయంగా బిజీ అయ్యారు. కెరీర్‌ ఒడిదుడుకులకు లోనయ్యింది. దీంతో ఆ కోరిక అలానే ఉండిపోయింది. మరి ఇంతకి ఆ పాత్ర ఏంటి? ఆ సినిమా ఏంటి? అనేది చూస్తే. 
 


జానపద సినిమాల్లో మాయలమరాఠి పాత్రకు చాలా ప్రయారిటీ ఉంటుంది. విలనిజం ఉన్న రోల్‌ అది. `బాలనాగమ్మ` కథలో మాయల మరాఠి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాత్రని పోషించాలనేది ఎన్టీఆర్ కోరిక. అయితే ఈ సినిమాలో ఆయన ముందే నటించారు. వేదాంతం రాఘవయ్య 1959లోనే `బాలనాగమ్మ` మూవీని రూపొందించారు.

ఎన్టీఆర్‌, అంజలి దేవి, ఎస్వీఆర్‌ ఇందులో నటించారు. ఇందులో బాల నాగమ్మగా అంజలి దేవి నటించగా, ఎన్టీఆర్‌ కార్యవర్ది పాత్రలో కనిపించారు. ఓ రకంగా ఆయనది హీరో పాత్ర. ఇక అసలుదైన మాయల మరాఠి పాత్రలో ఎస్వీరంగారావు నటించారు. 
 

అందులో ఎస్వీరంగారావు వేషాధారణ, ఆయన నటన చూసి ముగ్దుడయ్యాడట రామారావు. ఓ రకంగా జెలసీగా కూడా ఫీలయ్యాడట. అప్పట్నుంచి అలాంటి పాత్ర తాను పోషించాలని మనసులో ఉండిపోయిందట. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత తన మనసులో మాట బయటపెట్టారు ఎన్టీఆర్. అది కూడా సీఎం అయ్యాక. సింగీతం శ్రీనివాసరావుతో ఈ విషయాన్ని చెప్పాడట.

`బాలనాగమ్మ` సినిమాలో నటించాలని ఉందని, మీరు డైరెక్ట్ చేస్తే తానే స్వయంగా నిర్మిస్తానని తెలిపారట ఎన్టీఆర్‌. అయితే అందులో మీ ఆసక్తి ఏంటంటే తనకు మాయల మరాఠి పాత్ర చేయాలని ఉందని చెప్పాడట. అది కూడా ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే. సింగీతం ఆ కథ వర్క్ చేస్తుండగానే రాజకీయాల్లో ఆయన చాలా బిజీ అయిపోయారని, రాజకీయంగా ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో సినిమాలు చేసే పరిస్థితి లేదు.

దీంతో ఎన్టీఆర్‌కి ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎన్టీఆర్‌ శతజయంత్రి ఉత్సవాల సమయంలో ఓ యూట్యూబ్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్స్ వైరల్‌ అవుతుంది. 
 

సింగీతం శ్రీనివాసరావు.. ఎన్టీఆర్‌ వారసుడు బాలకృష్ణతో మూడు నాలుగు సినిమాలు చేశారు. `ఆదిత్య 369`, `భైరవ ద్వీపం`, అలాగే `శ్రీకృష్ణా విజయం` సినిమాలు చేశారు. ఈ మూడూ పెద్ద విజయం సాధించాయి. `శ్రీకృష్ణ విజయం` ఎన్టీఆర్‌ నటించిన చిత్రానికి రీమేక్‌ కావడం విశేషం. అదే పేరుతోనే రూపొందించారు.

అయితే ఎన్టీఆర్‌ సినిమా అంతటి విజయాన్ని సాధించలేకపోయింది. ఇక సింగీతం ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన వయసు మీదపడటంతో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల రాజ్‌ తరుణ్‌ నటించిన `భలే ఉన్నాడే` సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. 

read more: శోభన్‌బాబుని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా?.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, కృష్ణలకు ఉన్న తేడా అదే

also read: `బాహుబలి` డిజాస్టరా? నిర్మాతలకు భారీ నష్టం, కలెక్షన్ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపెట్టిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌

Latest Videos

click me!