మూడుసార్లు పెళ్లి చేసుకున్న ఈ వివాదాస్పద హీరోయిన్‌ని గుర్తు పట్టారా? చిన్ననాటి రేర్‌ ఫోటోలు

First Published | Nov 24, 2024, 1:34 PM IST

తన సొంత తండ్రే ఇంట్లోంచి గెంటేశాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఒంటరిగా బతుకుతున్న ఈ తమిళ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

సినిమా నటీమణులు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. వివాదాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఈ నటిదే. విజయ్ సరసన నటించిన ఈమె, పెళ్లి జీవితంలో సక్సెస్ కాలేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా, మూడూ విడాకుల్లో ముగిశాయి. తండ్రితో గొడవపడి, ఇప్పుడు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఆమె చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్‌ కుమార్‌

ఈ అమ్మడు ఎవరో కాదు వనితా విజయ్ కుమార్. నటుడు విజయ్ కుమార్, ఆయన రెండో భార్య మంజుల కూతురు. హీరోయిన్ గా నటించినా, వివాదాలతోనే ఫేమస్ అయ్యారు. విజయ్, రాజ్ కిరణ్ లాంటి స్టార్స్ సరసన నటించిన వనితా, 2000 లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు.


వనితా చిన్ననాటి ఫోటో

వనితా మొదటి భర్త ఆకాష్, నటుడే. వీరికి శ్రీహరి అనే కొడుకు. వనితా - ఆకాష్ పెళ్లి 7 ఏళ్లకే ముగిసింది. 2007 లో ఆకాష్ కి విడాకులిచ్చారు వనితా. అదే ఏడాది రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతో శ్రీహరి తండ్రి ఆకాష్ తో వెళ్లిపోయాడు.

విజయ్, వనితా

వనితా రెండో భర్త రాజన్. వీరికి ఇద్దరు ఆడపిల్లలు - జోవికా, జయనిక. ఈ పెళ్లి కూడా 5 ఏళ్లకే విడాకుల్లో ముగిసింది. వరుస విడాకులతో బాధపడ్డ వనితా, తండ్రి విజయ్ కుమార్ మధ్య గొడవ జరిగింది. దీంతో వనితాను ఇంట్లోంచి గెంటేశారు విజయ్ కుమార్.

వనితా విజయ్ కుమార్

పిల్లలతో ఒంటరిగా బతికిన వనితా, కొన్నాళ్లు వివాదాలకు దూరంగా ఉన్నారు. 2019 లో తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. షోలోకి వెళ్లిన వనితా, గొడవలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ సీజన్ ఇప్పటికీ గుర్తుండిపోవడానికి వనితానే కారణం. అంతలా రచ్చ చేశారు.

బిగ్ బాస్ ఫేమ్ వనితా

బిగ్ బాస్ తర్వాత వనితకు సినిమా అవకాశాలు వచ్చాయి. 2020 లాక్ డౌన్ సమయంలో పీటర్ పాల్ ని ప్రేమిస్తున్నట్టు చెప్పి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లి కొన్ని నెలల్లోనే ముగిసింది. మద్యం తాగి గొడవ చేసిన పీటర్ పాల్ ని ఇంట్లోంచి గెంటేశారు వనితా.

వనితా చిన్ననాటి అరుదైన ఫోటోలు

మూడు పెళ్లిళ్లు విడాకుల్లో ముగిసినా, సినిమాల్లో రాణిస్తున్నారు వనితా. ఆమె కూతురు జోవికా కూడా బిగ్ బాస్ తో ఫేమస్ అయ్యి, ఇప్పుడు హీరోయిన్ గా నటించడానికి సిద్ధమవుతోంది. ఈలోగా వనితా చిన్ననాటి అరుదైన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. వనితా తెలుగులోనూ సినిమాలు చేశారు. ఆమె `దేవి` అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు గతేడాది `మళ్లీపెళ్లి` సినిమాలో నరేష్‌ మూడో భార్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. 

read more: ఎన్టీఆర్‌ బాగా ఇష్టపడ్డ పాత్ర ఏంటో తెలుసా? ఎస్వీఆర్‌పై జెలసీతో మళ్లీ చేయాలనుకున్నా, ఆ కోరిక తీరకుండానే

also read: శోభన్‌బాబుని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా?.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, కృష్ణలకు ఉన్న తేడా అదే

Latest Videos

click me!