పూరి జగన్నాథ్ ఆలయ, ప్రసాదాల గురించి ఈ రహస్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

First Published Oct 17, 2021, 8:34 PM IST

పూరి జగన్నాథ్ ( Puri Jagannath) ఆలయ ప్రత్యేకత గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ జగన్నాథ రథయాత్ర (Jagannath Ratha Yatra) ఘనంగా జరుగుతుంది. ఈ దేవాలయం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పూరి జగన్నాథ్ ( Puri Jagannath) ఆలయ ప్రత్యేకత గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ జగన్నాథ రథయాత్ర (Jagannath Ratha Yatra) ఘనంగా జరుగుతుంది. ఈ దేవాలయం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఒకటి.
 

పూరి జగన్నాధుడు తన సోదరి సుభద్ర (Subhadra) , సోదర బలరాములతో  (Balram) సమేతంగా కొలువై ఉంటాడు. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం12 రోజులు సాగుతుంది. ఇక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక ఇప్పుడు ఈ ఆలయం విశిష్టత, అంతుచిక్కని విషయాల గురించి తెలుసుకుందాం. 
 

దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ప్రసిద్ధమైంది. ఇక్కడ ప్రతి ఏటా జరిపే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శ్రీ మహావిష్ణువు (Sri Maha Vishnu) కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న (Indradyumna) మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతాయి.
 

పూరి జగన్నాథ ఆలయంలోని కృష్ణుడు( Krishnudu), సుభద్ర, బలరాముల ( Subhadra, Balrama) విగ్రహాలు చెక్కతోనే కొలువై ఉంటారు. పన్నెండు సంవత్సరాల కొకసారి ఈ విగ్రహాలను మారుస్తూ ఉంటారు. ఈ విగ్రహాలను మార్చే సమయంలో పూరీలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. గోపురం పై ఉండే జెండాలు హిందూ మత చిహ్నాలను కలిగి ఉంటుంది.
 

ఈ జెండాకు (Flag) ప్రత్యేక విశిష్టత ఉంది. జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో (Opposite way) రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.గుడిపైన చాలా ఎత్తులో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా కనిపిస్తుంది.
 

ఈ చక్రం మనం ఏ వైపు నుంచి చూసినా అది మన వైపునే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని (Chakram) ఉంచిన తీరు మిస్టరీగానే మిగిలిపోయింది. గుడిపైన విమానాలు, పక్షులు ( Aeroplane, Birds) తిరగవు. పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు.
 

ఇది దైవశక్తి కారణంగా జరుగుతనేది అంతుచిక్కని విషయం. పూరి ఆలయానికి నాలుగు ద్వారాలు (Four Doors) ఉంటాయి. ఇందులో సింహద్వారం (Simhadwaram) ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించినప్పుడు సముద్రతీరం అలల శబ్దం వినపడదు కానీ ఒక అడుగు బయటికి వేయగానే సముద్ర అలల శబ్దం స్పష్టంగా వినపడుతుంది.
 

45 అంతస్తుల (45 Floors) ఎత్తు గల ఈ ఆలయంపైకి (Temple) ప్రతిరోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఒక్కరోజు ఈ ఆచారం తప్పితే 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఈ ఆలయానికి వివిధ దేశాల నుంచి ప్రతి రోజూ భక్తులు వస్తుంటారు.
 

ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని (Prasadham) ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం జరగలేదు.ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు (Seven Pots) ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం పూరి జగన్నాథ్ ప్రసాదం విశిష్టత.

click me!