fruit juices
బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిలో పండ్లను తినడం కూడా ఉంది. అవును కొన్నిరకాల పండ్లు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే కొంతమంది వెయిట్ లాస్ అయ్యేందుకు పండ్లను అలాగే తింటే.. మరికొంతమంది ఆ పండ్లను జ్యూస్ గా చేసుకుని తింటుంటారు.
కానీ బరువు తగ్గడానికి పండ్లను అలాగే తినడం మంచిదా? లేకపోతే ఆ పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగడం మంచిదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోషకాలు
పండ్లు, పండ్ల రసాల మధ్యనున్న ఫస్ట్ తేడా వాటి పోషకాల్లో తేడాలు. మీకు తెలుసా? పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఇకపోతే పండ్లను జ్యూస్ గా చేసే ప్రాసెస్ లో వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్ పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా.. ఈ జ్యూస్ ను టేస్టీగా చేయడానికి వాటిలో చక్కెరను కలుపుతుంటారు. దీనివల్ల పండ్ల జ్యూస్ లో కేలరీలు పెరిగిపోతాయి. కాబట్టి వీటిని తింటే బరువు పెరిగిపోవడం తప్ప తగ్గడం ఉండదు.
fruit juices
ఫైబర్ కంటెంట్
బరువును తగ్గించడంలో ఫైబర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది చాలా సేపటి వరకు కడుపును నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా ఆకలి కానీయదు. అయితే మొత్తం పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అయితే పండ్ల రసాలలో మాత్రం ఫైబర్ కంటెంట్ ఉండదు. దీనివల్ల మీరు ఎంత జ్యూస్ తాగినా కడుపు నిండినట్టుగా అనిపించదు. దీనివల్ల మీరు అతిగా తినే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి పండ్ల రసాల కంటే పండ్లే చాలా బెటర్.
కేలరీలు
పండ్ల రసాలలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పండ్లను తినడం కంటే పండ్ల జ్యూస్ ను తాగడం ద్వారానే మీరు ఎక్కువ కేలరీలను తీసుకుంటారు. ఇది మీ బరువును మరింత పెంచుతుంది. కాబట్టి పండ్ల జ్యూస్ లు మీరు బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి పండ్ల జ్యూస్ లు కాకుండా పండ్లను తినడానికే ప్రయత్నించండి.
హైడ్రేషన్
పండ్ల రసాలు రోజువారి హైడ్రేషన్ కు సహాయపడుతుంది. కానీ పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు మిమ్మల్ని మంచి హైడ్రేట్ గా ఉంచడానికి బాగా సహాయపడతాయి. మీరు బరువు తగ్గాలంటే మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం.
ఎందుకంటే హైడ్రేట్ గా ఉంటే ఆకలి తగ్గుతుంది. అతిగా తినకుండా ఉంటారు. అందుకే మీరు హైడ్రేట్ గా ఉండాలంటే పండ్లను అలాగే తినండి. బరువు తగ్గాలంటే పండ్ల రసాలకు బదులుగా పండ్లను తినడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.