దసరా పండుగ రోజు చెయ్యాల్సిన పనులు.. చెయ్యకూడని పనులు ఇవే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 15, 2021, 09:20 AM IST

దసరా (Dasara) హిందువులు జరుపుకొనే ముఖ్యమైన పండుగ. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేసి పదవ రోజు దసరాగా జరుపుకుంటారు. దసరా అంటే దశహర. దశరాత్రులు (Dasharatrulu) అని అర్థం. దసరా (Dasara) హిందువులు జరుపుకొనే ముఖ్యమైన పండుగ. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేసి పదవ రోజు దసరాగా జరుపుకుంటారు. దసరా అంటే దశహర. దశరాత్రులు (Dasharatrulu) అని అర్థం. 

PREV
18
దసరా పండుగ రోజు చెయ్యాల్సిన పనులు.. చెయ్యకూడని పనులు ఇవే!

దసరా (Dasara) హిందువులు జరుపుకొనే ముఖ్యమైన పండుగ. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేసి పదవ రోజు దసరాగా జరుపుకుంటారు. దసరా అంటే దశహర. దశరాత్రులు (Dasharatrulu) అని అర్థం. దశ పాపాలను తొలగిస్తుంది. ఇక ఈ రోజు దసరా సందర్బంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 

28

జగన్మాత అయిన దుర్గాదేవి (Durga Devi), మహిషాసురుడనే (Mahishasurudu) రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండగ జరుపుకుంటారు.
 

38

దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని (Palasamudram) చిలికినప్పుడు విజయదశమి రోజున అమృతము (Amrutham) లభించిందని పురాణాలు చెబుతాయి. అంతేకాకుండా రాముడు రావణున్నీ సంహరించిన విజయోత్సవం సందర్భంగా  దసరాగా జరుపుకుంటారు.
 

48

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ద నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు (Navaratrulu) చేయగా పదవ రోజు విజయదశమిగా దసరా జరుకుంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ దసరా. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి (Sharannavavaratri)  అని కూడా పిలుస్తారు.
 

58

ఈ నవరాత్రులు దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైనది (lovable). ఈ అమ్మవారిని నవరాత్రులలో పూజించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం, సంతానం, వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి (Development) ఉంటుంది. ఇలా అందరూ తమ తమకు సంబంధించిన విషయాలలో దుర్గాదేవిని కొలుచుకుంటారు.
 

68

ఇక ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి. ఇంటిని, పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. గడపకు ముగ్గులు వేయాలి. ఈ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి (Rajarajeshwari) దేవిగా, దుర్గదేవిగా (Durga Devi) ఎర్ర కలువలతో పూజించాలి. నైవేద్యంగా పులిహోర, పూర్ణాలు, లడ్డులు సమర్పించాలి.
 

78

తొమ్మిది ఒత్తులతో కూడిన నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో దీపారాధన చేయాలి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకం (Devi Ashtakam) లేదా మహిషాసుర సంహారిణి (Mahishasura Samharini) అష్టకాన్ని పట్టించాలి. శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కర్పూర హారతినివ్వాలి.
 

88

ఈ రోజు ఆయుధ పూజ (Ayudha Pooja), వాహన పూజలు (Vahana Pooja) కూడా చేసుకుంటే శుభం కలుగుతుంది. దసరా రోజు రాత్రి మరో విశేషంగా జరుపుకునే పూజ శమీ పూజ. శమీ వృక్షము అంటే జమ్మి చెట్టు. ఈ పూజ దసరా రోజు మాత్రమే చేస్తారు. ఈ పూజ చేసిన దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలుగుతుంది.

click me!

Recommended Stories