దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు.. పండుగ పరమార్థం ఏమిటి?

First Published Nov 3, 2021, 3:41 PM IST

దీపావళి (Diwali) అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దీపాల అలంకరణ, లక్ష్మీ పూజ, బహుమతులు. చీకటిని తరిమి కొట్టి వెలుగును తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా దీపావళి ఎందుకు జరుపుకుంటారు, ఈ పండగ  వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం..

నరకాసురుడనే (Narakasurudu) రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి (Diwali) చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు.
 

ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా (Narakachaturdhasi) జరుపుకుంటారు. దీపావళి రోజున దీపారాధన, లక్ష్మీ పూజ (Lakshmi Puja) చేస్తారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఈ దీపాలంకరణ మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సంపదలకు నిదర్శనంగా భావిస్తారు.
 

మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను కార్తీక పౌర్ణమినాడు (Karthika pournami) ముత్తయిదువులు సముద్రపు స్నానాలను ఆచరించి నదులలో (Rivers) వదులుతారు. ఇది వారి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.
 

దీపావళి పండుగ రోజున మహాలక్ష్మీ పూజ జరుపుకుంటారు. దీని వెనుక ఓ ప్రత్యేక కథ ఉంది. దుర్వాస మహర్షి (Durvasa maharishi) ఒకరోజు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహత్తరమైన హారాన్ని  ఇస్తాడు. ఇంద్రుడు హారాన్ని తిరస్కరించి తన ఐరావతం అయిన ఏనుగు (Elephant) మెడలో వేస్తాడు. అప్పుడు ఐరావతము ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.
 

అది చూసిన దుర్వాసమహర్షి కోపంతో రగిలిపోయి దేవేంద్రుని (Devendrudu) శపిస్తాడు. దాంతో దేవేంద్రుడు తన సర్వసంపదలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ (Mahalakshmi) స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు.
 

ఇలా తన పూజకు మెచ్చి లక్ష్మీదేవి (Lakshmi devi) తిరిగి తన సర్వసంపదలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా త్రికరణ శుద్ధితో పూజించే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని (Mahalakshmi) పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఈ పండుగ వెనుక అనేక కథలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  
 

శ్రీరాముడు (Sri ramudu) లంకలోని రావణుడిని (Ravanudu) సంహరించి విజయాన్ని పొందుతారు. శ్రీరాముడు సతీసమేతంగా తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ఆరోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారని రామాయణం తెలియజేస్తోంది.
 

శ్రీ మహా విష్ణువు (Sri maha vishnuvu) వరాహ అవతారాన్ని ధరించినపుడు ఆయనకి భూదేవికి జన్మించినవాడు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు కృష్ణుని అవతారం ఎత్తి సత్యభామగా (Sathyabhama) జన్మించిన భూదేవితో కలిసి యుద్ధానికి వెళతాడు.
 

అప్పుడు సత్యభామ (Sathyabhama) నరకాసురుడిని సంహరిస్తుంది. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి, మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. ఈ విధంగా దీపావళి (Diwali) పండుగను జరుపుకోవడానికి అనేక కథలు ఉన్నాయి.

click me!