శృంగారంలో పాల్గొనడానికి ఉత్తమ సమయం ఇదే..! ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువే..

R Shivallela | Published : Sep 22, 2023 2:12 PM
Google News Follow Us

సెక్స్ సమయంలో ఎక్కువ ఆనందాన్ని పొందడానికి, గర్భం దాల్చే అవకాశాల్ని పెంచడానికి కొన్ని సమయంలో సెక్స్ లో పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు. 
 

15
శృంగారంలో పాల్గొనడానికి ఉత్తమ సమయం ఇదే..! ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువే..

సెక్స్ తో బోలెడు మానసిక, శారీరక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏ సమయంలో సెక్స్ లో పాల్గొంటే మంచిదని చాలా మందికి డౌట్లు వస్తుంటాయి. నిపుణుల ప్రకారం.. ఉదయం లేదా అండోత్సర్గము రోజున శృంగారంలో పాల్గొనడం మంచిది. 
 

25

ఈ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. ఒత్తిడి కూడా మటుమాయం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు దంపతులు ఉదయాన్నే శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. 
 

35

కొంతమంది వైద్యుల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలు శృంగారంలో పాల్గొనడానికి ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ సమయంలో స్త్రీ పురుషులిద్దరూ మరింత సమతుల్యమైన మానసిక స్థితిలో ఉంటారు. ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు. అయితే పురుషులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శారీరకంగా చురుగ్గా ఉంటారు. ఈ సమయంలో వారి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మెరుగ్గా ఉంటాయి. అయితే మహిళల్లో మధ్యాహ్నం మాత్రమే ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా పెరుగుతుంది. 
 

Related Articles

45

ఆ సమయంలో ఆడవారిలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆడవారి శక్తిని, ఉద్వేగాన్ని పెంచుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సెక్స్ లో పాల్గొనడానికి బెస్ట్ టైం అని అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. 1,000 మందిపై జరిపిన ఒక అధ్యయనంలో.. సెక్స్ చేయడానికి ఉత్తమ సమయం ఉదయం 7:30, అంటే నిద్రలేచిన 45 నిమిషాల తర్వాత అన్నమాట.

55

ప్రెగ్నెన్సీ పీరియడ్స్ సమయంపై ఆధారపడి ఉంటుంది. అయితే రుతు చక్రాల పొడవు ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది. అందుకే గర్భందాల్చడానికి ఉత్తమ సమయం అండోత్సర్గము జరిగిన రోజు అంటే అండోత్సర్గము ప్రారంభమైన రోజు అన్నమాట. అండోత్సర్గము నుంచి గుడ్డు విడుదలైనప్పుడు, దానికి ఐదు రోజుల ముందు సెక్స్ లో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 
 

Recommended Photos