శృంగారాన్ని అతిగా ఆస్వాదించాలన్న ఆరాటంలో...

First Published | May 30, 2020, 3:08 PM IST

పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచే ఆయుర్వేద మందు, లేహ్యం, ట్యాబ్ లెట్స్ అంటూ.. తరచూ కొన్ని సంస్థలు ప్రకటలు ఇస్తూనే ఉంటాయి. వాటిని చూసి మోపోయి.. కొనుగోలు చేస్తే.. లేని సమస్యలు తోడవ్వడం ఖాయమంటున్నారు నిపుణులు. 
 

శృంగారం విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు, సందేహాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
undefined
చాలా మంది లైంగికజీవితం ఆనందంగా సాగుతున్నప్పటికీ.. ఇంకా ఎక్కువ ఆనందం పొందాలని ఆశపడుతుంటారు. ఆ ఆశతో కొన్ని చేయకూడని పనులు చేసి తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు..
undefined

Latest Videos


పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచే ఆయుర్వేద మందు, లేహ్యం, ట్యాబ్ లెట్స్ అంటూ.. తరచూ కొన్ని సంస్థలు ప్రకటలు ఇస్తూనే ఉంటాయి. వాటిని చూసి మోపోయి.. కొనుగోలు చేస్తే.. లేని సమస్యలు తోడవ్వడం ఖాయమంటున్నారు నిపుణులు.
undefined
చాలా మంది ఇలాంటి మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
లైంగికత చాలా సున్నితమైన అంశం. ఏ చిన్న ఇబ్బంది కలిగినా దంపతుల్లో ఏ ఒక్కరూ... పరిపూర్ణ శృంగార అనుభూతిని ఆస్వాదించలేరు.
undefined
అలాంటి సమయంలో ఏ సెక్సాలజిస్టునో సంప్రదించాలి. కానీ.. చాలా మంది ఆ ఒక్కటీ తప్పించి అన్ని ప్రయత్నాలూ చేస్తారు. మరికొందరిలో... ఏ సమస్యా ఉండదు.
undefined
ఇంకాస్త లైంగిక శక్తిని పెంచుకోవాలన్న ఆరాటం, మరికాస్త అనుభూతిని పొందాలన్నతపన, వయసుతో పాటూ వచ్చే పరిమితుల్ని ఒక్క పూటలో గెలవాలన్న దురాశ... వారిని పక్కదార్లు పట్టిస్తుంది. ఆధునిక వైద్యంలోనూ లైంగికాసక్తిని పెంచే మందులు ఉన్నాయి.
undefined
అయితే, వాటిని వైద్యుల సిఫార్సుతోనే వాడాలి. వీటికి దుష్ప్రభావాలు ఎక్కువ. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.
undefined
మీలో కోరికల్ని రగిలించే శక్తి... ముందులకంటే మీ జీవిత భాగస్వామి కే ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి.
undefined
ఇదిలా ఉండగా.. భార్య భర్తలు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే..వారి లైంగిక జీవితం ఆనందంగా ఉండాలనేది నిపుణుల వాదన. అయితే.. ప్రస్తుత కాలంలో మెడ్రల్ లైఫ్ స్టెయిల్ అనేది దంపతుల అన్యోన్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టెక్నాలజీ వల్ల సమాచారం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.
undefined
శృంగారం గురించి కూడా బోలెడు సమాచారాన్ని సాంకేతికత ఉపయోగించి తెలుసుకోవచ్చు. కానీ అదే టెక్నాలజీ సెక్స్ లైఫ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.ఇంట్లో టైం పాస్ కావడానికి మనం చూసే టీవీలు.. శృంగార జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయట.
undefined
ఇంట్లో టీవీ లేని వారితో పోలిస్తే.. టీవీ ఉన్న దంపతులు వారానికి ఆరు శాతం తక్కువగా శృంగారంలో పాల్గొంటున్నారట. సెక్స్ లైఫ్‌ను టీవీలే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా నాశనం చేస్తున్నాయట. కాబట్టి రాత్రి పూట వీటికి కాస్త దూరంగా ఉండండి.
undefined
మీ జీవిత భాగస్వామితో ప్రేమగా గడపాలి. పడకగదిని సరికొత్తగా అలంకరించుకోవాలి. ఏకాంతంలో చక్కని సంగీతాన్ని ఆస్వాదించాలి.ఇలా చేస్తే.. మీ ఉత్సాహం రెట్టింపు అవ్వడం ఖాయం. అయినా ఫలితం దక్కలేదు అంటే.. సంబంధిత నిపుణులను కలవడం మంచిది.
undefined
click me!